Just In

6/trending/recent

Ads Area

Water Bottle: ఇంత నిర్లక్ష్యమా? వాటర్ బాటిల్ అడిగితే.. యాసిడ్ బాటిల్ ఇచ్చిన వ్యాపారి.. ఏం జరిగిందంటే?

Water Bottle: నిర్లక్ష్యం ఖరీదు ఎలా ఉంటుందని చెప్పే అమానుష సంఘటన అది.. మండే ఎండలో గొంతు ఎండిపోతోందని.. వాటర్ బాటిల్ కొని నీళ్లు తాగుదాం అనుకోవడమే ఆ యువకుడి పాపమైంది. ఎదో ఆలోచనలో ఉన్న వ్యాపారీ చేసిన పొరపాటుకి యువకుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు.

Water Bottle: ఇంత నిర్లక్ష్యమా? వాటర్ బాటిల్ అడిగితే.. యాసిడ్ బాటిల్ ఇచ్చిన వ్యాపారి.. ఏం జరిగిందంటే?

Water Bottle: ఇంత నిర్లక్ష్యమా? వాటర్ బాటిల్ అడిగితే.. యాసిడ్ బాటిల్ ఇచ్చిన వ్యాపారి.. ఏం జరిగిందంటే?

Water Bottle: మే నెల రాకముందే మాడు పగిలిపోతోంది. ఎండలు మండిపోతున్నాయి.. ఉదయం 9 గంటల నుంచే రోడ్డు ఎక్కాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి. ఇంటి నుంచి కాలు బయట పెడితే చాలు వడదెబ్బ వణికేలా చేస్తోంది. ఇంట్లో ఉండాలి అన్నా ఉక్కపోత చెమటలు కారేలా చేస్తోంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లే వారికి గొంతు ఎండిపోతోంది. అలా బయటకు వెళ్లిన ఓ విద్యార్థి ప్రాణాన్ని మరొకరి నిర్లక్ష్యం బలి తీసుకుంది. వ్యాపారి చూపించిన నిర్లక్ష్యానికి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు ఆ విద్యార్థి. విజయవాడ (Vijayaswada) ఎనికేపాడులో ఓ డిగ్రీ విద్యార్థి మంచి నీటి బాటిల్ కోసం వస్తే.. ఆ షాపులో ఉన్న వ్యాపారీ ఏమరుపాటుతో ప్రవర్తించాడు ఆ వ్యాపారి. మంచినీళ్లకు బదులుగా యాసిడ్ బాటిల్ ఇవ్వడంతో అసలే దాహంతో ఉండి అక్కడకు వచ్చిన చైతన్య అనే స్టూడెంట్ బాటిల్‍‌ను ఓపెన్ చేసి వెంటనే తాగేశాడు. యాసిడ్(Acid) అని ఇద్దరికీ తెలియకపోవడంతో కాసేపటికే అస్వస్థతకు గురయ్యాడు.

అప్పటికే పూర్తి దాహంగా ఉన్నఆ విద్యార్థి అది ఏంటి అని చూడకుండా? గడగడా అంటూ.. ఆ బాటిల్ లో యాసిడ్ తాగేశాడు. దీంతో విద్యార్థి నోరంతా మండింది. అన్ని అవయవాల్లోకి ఆ యాసిడ్ వెళ్లిపోయింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఈ నెల 14 వ తేదీన చోటు చేసుకుంది. బాటిల్ తాగి కిందకు పడిపోయిన విద్యార్థిని గమనించాక తాను ఇచ్చింది వాటిర్ బాటిల్ కాదు.. యాసిడ్ బాటిల్ అని గుర్తించాడు. విద్యార్థి స్నేహితుడు కూడా పక్కనే ఉండడంతో.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించిందని చికిత్స మొదలుపెట్టారు. లయోల కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి పరిస్థితికి జాలిపడిన కాలేజీ యాజమాన్యం, తోటి విద్యార్థులు విరాళాలు సేకరించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు.


ఏనికేపాడు లో అమ్మ ఫాన్సీ అండ్ జనరల్ స్టోర్ కొట్టులో ఘటన నిర్లక్ష్య ఘటన చోటు చేసుకుంది. బాటిల్ అని యాసిడ్ తాగిన చైతన్యకు ఆరోగ్యం విషమించింది. అయితే అదే సమయంలో పక్కనే అతడి స్నేహితుడు ఉండడం.. అతడు అలర్ట్ అయ్యి.. ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్లడంతో.. చైతన్యకు ప్రాణాపాయం తప్పింది. కానీ అప్పటికే పూర్తిగా యాసిడ్ తాగడంతో శరీరంలోని అవయవాలు కొంత దెబ్బతిన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో విద్యార్థి చైతన్యకు నాలుగు రోజులుగా చికిత్స కొనసాగుతోంది. చైతన్య ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని తోటి విద్తార్దులు కోరుతున్నారు. అంతేకాదు వైద్య చికిత్సకు అవసరమైన డబ్బులు కోసం విద్యార్ది చదువుతున్న లయోలా కళాశాల యాజమాన్యం విద్యార్దులనుండి డోనేషన్స్ సేకరిస్తోంది. మరోవైపు ఆ విద్యార్థి ప్రాణాలతో చెలగాటమాడిన షాపు యజమానిపై చర్యలు తీసుకోవాలని తోటి విద్యార్థులు, చైతన్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లక్కీగా ప్రాణాపాయం తప్పిందని.. కానీ ఏదైనా జరగకూడదని జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రమాకరమైన యాసిడ్ బాటిల్ ను మంచి నీళ్ల దగ్గర పెట్టి అమ్మడం ఏంటని.. ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information

Below Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information