Trending

6/trending/recent

Rains: TS ఉపరితల ద్రోణి.. రాష్ట్రంలో 3రోజులపాటు వర్షాలు: IMD -రైతుల్లో ఆందోళన

ఎండల నుంచి కాస్త ఉపశమనంగా రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కానీ, ధాన్యం కొనుగోళ్ల సీజన్ కావడంతో అకాల వర్షాలు ఎక్కడ కొంపముంచుతాయోనని రైతుల్లో ఆందోళన నెలకొంది.

Rains: TS ఉపరితల ద్రోణి.. రాష్ట్రంలో 3రోజులపాటు వర్షాలు: IMD -రైతుల్లో ఆందోళన

తెలంగాణలో ఉక్కపోతలు, వేడిగాలుల నుంచి కాస్త ఉపశమనంగా రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కానీ, ధాన్యం కొనుగోళ్ల సీజన్ కావడంతో అకాల వర్షాలు ఎక్కడ కొంపముంచుతాయోనని రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాలు, ఉష్ణోగ్రతలకు సంబంధించి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చెప్పిన వివరాలివి..

ఇవాళ (ఏప్రిల్ 17, ఆదివారం) నుంచి ఏప్రిల్ 20(బుధవారం) వరకు వర్షాలు కురుస్తాయని చెప్పిన ఐఎండీ.. ఈ నెల 21 నుంచి మాత్రం వాతావరణంలో పెద్దగా మార్పులేం ఉండబోవని స్పష్టం చేసింది. మరోవైపు శనివారం ఆదిలాబాద్‌ జిల్లా భోరజ్‌లో 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 39.9, రామగుండంలో 39.4, హైదరాబాద్‌ శివారు దుండిగల్‌లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాత్రి పూట ఉక్కపోతల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు నిజామాబాద్, భద్రాచలంలో 28.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నెలరోజులపాటు నిర్విరామంగా ఎండలు దంచికొట్టడంతో ఇబ్బంది పడ్డ ప్రజలు గత రెండు, మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గడంతో ఉపశమనంగా ఫీలయ్యారు. అయితే ఇది ధాన్యం కొనుగోలు, అమ్మకాల సీజన్ కావడంతో వర్షాల వల్ల పంట ఎక్కడ పాడవుతుందోనని రైతుల్లో ఆందోళన నెలకొంది.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad