Just In

6/trending/recent

Ads Area

Samantha:నాగచైతన్యకు షాక్.. రెండో పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్

 గత కొన్ని రోజులుగా మీడియాలో నాగ చైతన్య రెండో పెళ్లిపై వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలో సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. రెండో పెళ్లిపై సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

Samantha:నాగచైతన్యకు షాక్.. రెండో పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్

సమంత.. టాలీవుడ్ టు బాలీవుడ్.. ఇప్పుడు జోరుగా వినిపిస్తున్న పేరు ఇదే. సమంత అంటే తెలియని వారుండరు. తన మొదటి సినిమా ఏం మాయ చేశావే(Em Maya Chesave)తోనే...అందర్నీ తన నటనతో మాయ చేసింది సమంత. ఇక అప్పటి నుంచి సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా ఆమెకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. హీరో నాగచైతన్యతో(Naga Chaitanya) పెళ్లి ఆ తర్వాత విడాకులతో కూడా సమంత (Samantha) హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నాగ చైతన్య (Naga Chaitanya)తో విడాకులు అయిన తర్వాత ఆమె కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. ఏ సినిమా ఆఫర్ వచ్చిన వదలకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. ఇటు తెలుగుతో పాటు.. అటు తమిళ్, హిందీ సినిమాల్లో కూడా సామ్ ఫుల్ బిజీగా మారింది.

టాలీవుడ్ అయితే ఆమె చేతిలో రెండు పాన్ ఇండియన్ సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో కూడా కొత్త సినిమా చేస్తోంది సమంత. తమిళ్ హీరో విజయ సేతుపతి, నయనతార తో చేసిన కాతు వాకుల రెండు కాదల్' మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.తెలుగులో యశోద(Yashoda) మరియు శాకుంతలం వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.ఇక గత ఏడాది ఫామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో OTT లోకి కూడా అడుగుపెట్టిన సమంత, ఇప్పుడు మరికొన్ని వెబ్ సిరీస్ లకు కూడా సంతకాలు చేసింది. కెరీర్ లో సమంత(Samantha) ఇంత బిజీ గా గతంలో ఎన్నడూ కూడా లేదు అనే చెప్పాలి.

అయితే గత కొద్దీ రోజుల నుండి సమంత గురించి సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా ప్రచారం అవుతోంది. అదే సమంత రెండవ పెళ్లి. ఇటు నాగ చైతన్య(Naga Chaitanya) కూడా రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో సమంతను కూడా ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి చేసుకోమని గత కొద్దీ రోజుల నుండి తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారని సమాచారం. పెళ్లి అయ్యి విడాకులు అయ్యినంత మాత్రాన జీవితం అక్కడే ఆగిపోకూడదు అని సమంత తల్లి తండ్రులు ఆమెకు సర్ది చెబుతున్నారట. అయితే సమంత కూడా అందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. తన గురించి తన తల్లిదండ్రులు పడుతున్న బాధ చూడలేక.. కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పిందట సామ్.

కానీ ప్రస్తుతానికి తాను సినిమాలపైనే దృష్టి పెడతానని... చెప్పింది. రెండో పెళ్లికి కాస్త సమయం కావాలని సమంత ఇంట్లోవాళ్లను కోరింది. తన వ్యక్తిగత జీవితంతో పాటు తన కెరీర్ కి గౌరవం ఇచ్చి తనని అర్థం చేసుకునే అబ్బాయి దొరికితే కచ్చితంగా ప్రేమించే పెళ్లి చేసుకుంటానని సమంత చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ వార్త కోలీవుడ్‌‌లో జోరుగా ప్రచారం సాగుతుంది. మొత్తం మీద సెకండ్ మ్యారేజ్‌కు సమంత ఓకే అన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై నాగచైతన్య ఎలా స్పందిస్తాడో చూడాల్సిందే.



Post a Comment

0 Comments

Top Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information

Below Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information