Trending

6/trending/recent

Corona Vaccine: 2 ఏళ్లు నిండిన పిల్లందరికీ కరోనా వ్యాక్సిన్లు.. ఏ టీకా? ఎప్పటి నుంచి..?

Corona Vaccine for Kids: మనదేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. గత ఏడాది జనవరి నుంచి నిర్విరామంగా టీకాలు వేస్తున్నారు. ప్రస్తుతం 12 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఐతే త్వరలో 2 ఏళ్లు నిండిన చిన్న పిల్లలకు కూడా టీకాలు వేయనున్నారు.

Corona Vaccine: 2 ఏళ్లు నిండిన పిల్లందరికీ కరోనా వ్యాక్సిన్లు.. ఏ టీకా? ఎప్పటి నుంచి..?

ప్రస్తుతం మన దేశంలో కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ.. కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పిల్లల్లో కోవిడ్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలపై కేంద్రం దృష్టిసారించింది. త్వరలోనే రెండేళ్లు పైబడిన వారికి టీకాలు ఇవ్వాలని భావిస్తోంది.

2-12  ఏళ్ల వయసున్న పిల్లలకు భారత్ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలు ఇవ్వాల్సిందిగా డీసీజీఐకి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (SEC)ప్రతిపాదనలు పంపనున్నట్లు ఓ ఉన్నతాధికారి న్యూస్18తో చెప్పారు. డీసీజీఐ ఆమోదం తెలిపిన వెంటనే.. వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 

2 ఏళ్లు పైబడిన పిల్లలకు టీకాలు వేసే అంశంపై ఇప్పటికే SECకి భారత్‌ బయోటెక్ డేటా సమర్పించింది. దానిపై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం సబ్జెక్స్ ఎక్స్‌పర్ట్ కమిటీ సమావేశమయింది. ఈ భేటీలో భారత్ బయోటెక్ సమర్పించిన క్లినికల్ ట్రయల్స్ డేటాను విశ్లేషించారు.

5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లలకు 'బయోలాజికల్ ఈ' కంపెనీ తయారుచేసిన కార్బోవ్యాక్స్ వ్యాక్సిన్‌ను వేయాలని డీసీజీఐకి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఇది వరకే ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. ఇక 2 ఏళ్లు నిండిన పిల్లలకు కొవాగ్జిన్ టీకా వేయాలని త్వరలోనే ప్రతిపాదించనుంది.

ప్రస్తుతం మనదేశంలో 12 ఏళ్లు పైబడిన పిల్లలకు రెండు వ్యాక్సిన్‌లు ఇస్తున్నారు. 15-18 ఏళ్ల వయసున్న పిల్లలకు జనవరి 3 నుంచి భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను వేస్తున్నారు. ప్రభుత్వ టీకా కేంద్రాలతో పాటు ప్రైవేట్ సెంటర్లలో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. 

మార్చి 16 నుంచి 12 ఏళ్ల పిల్లలకు కూడా టీకాలు ఇస్తున్నారు. 12-14 ఏళ్ల వయసున్న పిల్లలకు 'బయోలాజిక్ ఈ' అభివృద్ధి చేసిన కార్బోవ్యాక్స్ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఐతే ఈ టీకాలు ప్రభుత్వ టీకా కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

మన దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం నాటి డేటా ప్రకారం.. భారత్‌లో కొత్తగా 2,380 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,30,49,973కి చేరగా... ఇందులో 13,433 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 0.53గా ఉంది.

Corona Vaccine: 2 ఏళ్లు నిండిన పిల్లందరికీ కరోనా వ్యాక్సిన్లు.. ఏ టీకా? ఎప్పటి నుంచి..?


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad