Trending

6/trending/recent

Chanakya Niti: ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెడితే జీవితంలో బ్యాడ్ టైమ్ అనేదే రాదు..!

ఆచార్య చాణక్యుడి విధానాలు నేటికీ అనుసరణీయమైనవి ఉద్ఘాటించి చెప్పొచ్చు. మనిషి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆచార్య చాణక్యుడు జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడటానికి పరిష్కారం కూడా చెప్పాడు. చెడు సమయాల్లో మనిషి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. 

Chanakya Niti: ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెడితే జీవితంలో బ్యాడ్ టైమ్ అనేదే రాదు..!

ఆచార్య చాణక్యుడు ప్రకారం.. తెలివితక్కువ వ్యక్తితో జ్ఞానం గురించి మాట్లాడకూడదు. ఇది వెర్రితనం. దీనివల్ల మన సమయం వృథా అవుతుంది. ఇది చర్చను పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో, మూర్ఖులకు దూరంగా ఉండటం మంచిది. 

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. అవసరం ఉన్నవారికి దానం చేయాలి. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. పేదరికం నుండి బయటపడటానికి దానం చేయండి. దీనివల్ల పుణ్యం లభిస్తుంది. దీని వల్ల భవిష్యత్తులో మీరు ఎలాంటి ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోరు. 

ఆచార్య చాణక్యుడు ప్రకారం.. మీ ప్రవర్తన మర్యాదగా ఉండాలి. ఎదుటి వ్యక్తితో మర్యాదగా మాట్లాడండి. దీంతో ప్రజల్లో మీ గౌరవం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో దుఃఖాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. మత విశ్వాసాల ప్రకారం.. ఒక వ్యక్తి తన చర్యల కారణంగానే, తనకు ఆనందం, దుఃఖం కలుగుతాయి.

జ్ఞానాన్ని పొందడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఇది మీకు జీవితంలో విజయాన్ని అందిస్తుంది. జ్ఞానం లేని వ్యక్తికి గౌరవం లభించదు. జ్ఞానాన్ని పొందడం ద్వారా, ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు. దీనితో పాటు దేవుడిని పూజించండి. చెడు సమయాల్లో ధైర్యాన్నిస్తుంది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad