Trending

6/trending/recent

Pension: మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. చనిపోయిన నెలకే కుటుంబ సభ్యులకు పెన్షన్.. వివరాలివే

 Pension: మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల ఇబ్బందులు తీర్చేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి మరణించిన నెల రోజుల్లోనే పెన్షన్ అందించాలని ఆదేశాలు జారీ చేసింది.

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఊరట కలిగించేలా ఆదేశాలు జారీ చేసింది.

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే కుటుంబ సభ్యుల నుంచి క్లెయిమ్ వచ్చిన వెంటనే నెల రోజుల్లోపే అతని కుటుంబ సభ్యులకు పెన్షన్ అందించాలని వివిధ ప్రభుత్వ విభాగాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

పాత పెన్షన్‌ పథకం, జాతీయ పెన్షన్‌ కింద ఉండి మరణించిన ప్రభుత్వ ఉద్యోగికి అందాల్సిన మొత్తాన్ని ఆ కుటుంబానికి వెంటనే చెల్లించాలని తెలిపింది.

ఉద్యోగి చెల్లించిన మొత్తాన్ని, ఎన్‌పీఎస్‌ పెన్షన్‌ కార్పస్ ను కుటుంబ సభ్యులకు వెంటనే చెల్లించాలని ఆదేశాలను జారీ చేసింది.

దీంతో పాటు కుటుంబ పెన్షన్‌ను ప్రారంభిస్తున్న సమయంలోనే ఉద్యోగి శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్యను మూసివేయాలని స్పష్టం చేసింది.

పింఛన్ క్లెయిమ్ అందగానే సంబంధిత ఆఫీసర్ ప్రొవిజనల్ పింఛన్ ను అర్హులైన కుటుంబ సభ్యులకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

2020 జనవరి 1 నుంచి మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు, వారి కుటుంబ సభ్యుల పింఛన్ జారీ, ఇతర చెల్లింపుల వివరాలను నెలవారీగా పంపించాలని అన్ని శాఖలను కేంద్రం కోరింది.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad