Trending

6/trending/recent

Covid Third Wave: కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి మాట.. కొవిడ్ థర్డ్ వేవ్ ఆ నెలలో వచ్చే అవకాశం? ఎప్పుడంటే?

 Covid Third Wave News Alert: కొవిడ్ సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా...దేశానికి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సెకండ్ వేవ్‌ కట్టడి, ముంచుకొస్తున్న థర్డ్ వేవ్‌కు సంబంధించి నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Covid Third Wave News Alert:  కొవిడ్ సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా…దేశానికి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సెకండ్ వేవ్‌ కట్టడి, ముంచుకొస్తున్న థర్డ్ వేవ్‌కు సంబంధించి నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడంలో దేశం విజయం సాధించిందని…అందుకే దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. సెకండ్ వేవ్‌ను కట్టడి చేసిన తీరు పట్ల సంతృప్తి చెందుతున్నట్లు పేర్కొన్నారు. మన శాస్త్రసాంకేతికత, ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు, ఆక్సిజన్ సరఫరా కోసం రైల్వే సేవల వినియోగం, విమానాశ్రయాల వినియోగం, ఆర్మీ సేవల వినియోగం తదితర చర్యలు మంచి ఫలితాలు ఇచ్చినట్లు విశ్లేషించారు. గతంలో రోజుకు 4 లక్షల కరోనా కేసులు నమోదయ్యేవని…ఇప్పుడు ఆ సంఖ్యను 1.3 లక్షల స్థాయికి తీసుకురావడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. అదే సమయంలో థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు దేశం సన్నద్ధంకావాల్సిన అవసరముందన్నారు.

థర్డ్ వేవ్ ఎప్పుడు రావచ్చు?

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు రావచ్చన్న ప్రశ్నకు కూడా వీకే సారస్వత్ సమాధానం ఇచ్చారు. దేశంలో థర్డ్ వేవ్ రావడం తథ్యమన్నది వైద్య నిపుణుల అభిప్రాయంగా చెప్పారు. సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశముందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అప్పటిలోగా వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సిన అవసరముందన్నారు. థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా చిన్నారులు, యువకులపై ఉండొచ్చని ఇప్పటికే పలువురు వైద్య నిపుణులు విశ్లేషించడం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియతో మాత్రమే థర్డ్ వేవ్‌తో పాటు తదుపరి వేవ్‌లను కట్టడి చేయగలమని వారు సూచిస్తున్నారు.

సెకండ్ వేవ్‌కు ముందు తొలి వేవ్‌ను కూడా దేశం సమర్థవంతంగా కట్టడి చేయగలిగినట్లు వీకే సారస్వత్ చెప్పారు. ఎమర్జెన్సీ మెడికల్ మ్యానేజ్‌మెంట్‌లో దేశం పనితీరు సంతృప్తికరంగా ఉందని వ్యాఖ్యానించారు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad