Trending

6/trending/recent

SP Balu: ‘పాడుతా తీయగా’.. ఎస్పీబీ స్థానంలో ఎవరంటే?

SP Balu:  ఎంతో మంది యువ గాయనీ గాయకులకు అవకాశం కల్పించి వారి ప్రతిభను వెలుగులోకి తెచ్చిన కార్యక్రమం ‘పాడుతా తీయగా’. దివంగత గాయకుడు, గాన గంధర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తూ వ‌చ్చారు. కేవలం పాటలతోనే కాకుండా రసవత్తరమైన విషయాాలతో సాగిన ఈ ప్రోగామ్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంద‌రో అభిమానులున్నారు. అయితే బాలు మరణం తర్వాత ‘పాడుతా తీయగా’ ప్రోగ్రామ్ ఆగింది. ఈ ప్రోగ్రామ్ ఉండ‌దేమోన‌ని అంద‌రూ భావించారు. అయితే ఈటీవీ యాజ‌మాన్యం ఆ ప్రోగ్రామ్‌ను కొత్త జడ్జిల‌తో షురూ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే కొన్ని భాగాలకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ కూడా జ‌రిగింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. అయితే ఈసారి ఒకే వ్యక్తి జడ్జ్‌గా వ్యవహరించరు. ఎస్పీబీ తనయుడు చరణ్ సహా రైటర్ చంద్రబోస్, సింగర్ సునీతలు కూడా జడ్జ్‌లుగా వ్యవహరిస్తారు. బాలు స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరనేది వాస్తవం. కానీ ఓ మంచి ప్రోగ్రామ్‌ను కంటిన్యూ చేయ‌డం మంచి విష‌య‌మే. మ‌రి కొత్త న్యాయ నిర్ణేత‌ల‌తో ప్రారంభం కానున్న పాడుతా తీయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఎలా ఆక‌ట్టుకుంటుందో చూడాలి.


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad