Trending

6/trending/recent

Viral Photo : ఆక్సిజన్ పెట్టుకుని మరీ వంట చేస్తున్న మహిళ : ఇప్పుడు కూడా నీకు విశ్రాంతి లేదా తల్లీ..

 corona women Cooking with Oxygen Support : ‘మగువా..మగువా లోకానికి తెలుసా..నీ విలువా..’అని వకీల్ సాబ్ లో పాట. మహిళల శక్తి గురించి చెబుతుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ పని పనీ పని..అన్నట్లుగా ఉంటుంది మగువ. నీరసంగా ఉన్నా..అనారోగ్యం పాలైనా..ఆమె లేవందే ఇంట్లో పొయ్యి వెలగదు. ఆఖరికి కరోనా మహమ్మారిన బారిన పడి..ఊపిరి అందక ఆక్సిజన్ పైప్ ముక్కుకు పెట్టుకుని కూడా వంట ఇంటిలో వంట చేయాల్సిన పరిస్థితి. ఆక్సిజన్ పైపుని పెట్టుకుని వంట చేస్తున్న ఓ మహిళ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటో చూసినవారంతా..కరోనా సోకినవారు విశ్రాంతి తీసుకోవాలని..అలసిపోయే పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని అంటుంటారు. కానీ ఆక్సిజన్ పైపు పెట్టుకుని కూడా ఆమె వంట చేస్తోంది అంటూ ‘అనారోగ్యం పాలైనా..ఆమెకు వంటింటి పని తప్పదా? హద్దులు లేని అమ్మ పనికి..ప్రేమకు ఈ ఫోటో నిదర్శనమా? ఇంట్లో ఆమెకు విశ్రాంతి ఇచ్చేవారే లేరా? ఎంత రోగమొచ్చినా..అమ్మకు ఇంటి బాద్యతలు తప్పవా? అనిపిస్తోంది ఈ ఫోటో చూస్తుంటే..

ఈ ఫొటోలో తల్లికి కుటుంబ పట్ల ఉండే బాధ్యతా..ఆప్యాయత క‌నిపిస్తోందా? లేక‌ అటువంటి పరిస్థితిలో ఉండి కూడా ఆ తల్లి పనిచేయాల్సిందేనా? ఆమెకు విశ్రాంతి అవసరం లేదా? ఆమె మనిషి కాదా? అనే ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫొటోలో కరోనా బాధితురాలైన ఒక‌ మహిళ ఆక్సిజన్ పైప్ ముక్కుకి పెట్టుకుని వంట చేస్తోంది. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక యూజర్ షేర్ చేయటం ఆ ఫోటో చూసినవారంతా..లోకానికంతటికీ విశ్రాంతి ఉంటుందేమో..కానీ అమ్మకు మాత్రం ఉండదని అంటున్నారు.

ఆఖరికి క‌రోనా సోకినా..తల్లికి ఇంట్లో కూడా సిక్ లీవు లభించదని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ ఉద్యోగానికైనా లీవులుంటాయి. రిటైర్ మెంట్ ఉంటుంది. కానీ అమ్మకు మాత్రం లీవులు..రిటైర్ మెంట్ లు ఉండవు..అని అనిపిస్తోంది ఈ ఫోటో చూస్తుంటే..పైగా అమ్మకు బోనస్ గా మరింత పనిబాధత్యలే ఉంటాయి. ఈ జీవితాంతపు ఉద్యోగానికి పెన్షన్ అనే మాటే ఉండదు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad