Trending

6/trending/recent

Changes Must : కరోనా నుంచి కోలుకున్నవారు వీటిని కచ్చితంగా మార్చేయాలి..లేదంటే ప్రమాదమే

Change Must: కరోనా నుంచి కోలుకున్నవారు ఆ తరువాత తమ రోజువారీ చేసుకునే పనుల్లో మార్పులు తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వారు కరోనా ఉన్న సమయంలో ఉపయోగించిన వస్తువుల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

corona recovered persons Changes Must : కరోనా..ఒకసారి వచ్చి పోతే మళ్లీ రాదు అని ధీమాగా ఉండటానికి లేదు. కుటుంబంలో ఒకరికి వస్తే మొత్తం అందరికి వచ్చేస్తోంది. అలా సోకినా..కరోనా నుంచి ఒకసారి కోలుకొని హమ్మయ్య అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే కరోనా నుంచి కోలుకున్న వారికి కూడా మరోసారి వైరస్ సోకుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. మొదటిసారి కరోనా వచ్చాక..పోయిందిరా బాబూ ఇక ఏం ఫరవాలేదు అనుకుని రిలాక్స్ అయిపోవద్దనీ..అలాని భయపడవద్దని కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవి ఎటువంటి జాగ్రత్తలో తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది.

ఈ క్రమంలో ఇలా కరోనా రెండోసారి సోకకుండా ఉండాలన్నా.. ఒక కరోనా పేషెంట్ వల్ల అతని కుటుంబ సభ్యులకు ఈ వైరస్ వ్యాపించకూడదన్నా ఒక సూత్రం మాత్రం కచ్చితంగా పాటించాలని డాక్టర్లు చెప్తున్నారు. అదేంటో తెలుసుకుంటే భవిష్యత్తులో చాలా కరోనా కష్టాలు రాకుండా నిలువరించవచ్చు. కరోనా సోకి.. కోలుకుంటే వారు వెంటనే చేయాల్సిన పద్ధతులు ఉన్నాయని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వచ్చిన సమయంలో సదరు వ్యక్తి వాడిని టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ కచ్చితంగా కోలుకున్న తరువాత వాడకూడదని మరీ మరీ హెచ్చరిస్తున్నారు. సైంటిస్టులు చెప్పిన ప్రకారం..కరోనా సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.

అది ఆ వ్యక్తి నుంచి ఏ వస్తువుపై చేరుతుంది. లేదా గాలిలో కూడా కొన్ని రోజుల పాటు ఉంటుంది. సెల్ ఫోన్, కంప్యూటర్, మరేదైనా వస్తువుల మీద కొంత కాలం పాటు ఆ వైరస్ మరణించకుండా ఉంటుంది. వాటిని వేరేవారు పట్టుకుంటే అది వేరొకరికి సోకుతోంది.

ఇదిలా ఉంటే కరోనా సోకిన వ్యక్తి ఆ సమయంలో వాడిని టూత్ బ్రష్ లు. ట్రండ్ క్లీనర్లు కోలుకున్న తరువాత తప్పనిసరిగా వాటిని వాడకూడదని వాటిని పారేసి కొత్తవాటిని ఉపయోగించాలని చెబుతున్నారు. లేదా కక్కిర్తి పడో లేదా మరచిపోయే వాటిని వాడితే మరోసారి కరోనా బారిన పడవచ్చని హెచ్చరిస్తున్నారు. అలాగే కరోనా ఉన్న సమయంలో వాడిన బాత్రూమ్ ని కొన్ని వాడకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే బాత్రూమ్ లో ఎక్కడో అక్కడ నక్కి ఉన్న వైరస్ కొన్ని రోజుల పాటు సజీవంగా ఉంటుంది.

అదికనుక సోకితే మరోసారి కరోనా బారిన పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. కాబట్టి వీలైనంత శుభ్రంగా బాత్రూమ్ ను క్లీన్ చేయాలి. మరీ వీలైతే కొన్ని రోజుల పాటు ఆ బాత్రూమ్ ను ఉపయోగించకుండా ఉంటే మంచిది. అలాగే కరోనా ఉన్న సమయంలో సదరు బాధితుడు ఉపయోగించిన టూత్ బ్రష్, ట్రంగ్ క్లీనర్ లను అలాగే ఉంచేస్తే..ఒకే వాష్‌రూమ్ ఉపయోగించే కుటుంబ సభ్యులు కూడా కరోనా నుంచి కాపాడిన వారవుతారని చెప్తున్నారు.

కరోనా సోకిన సమయంలో ఉపయోగించే టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మీద వైరస్ చేరటం వల్ల కరోనా సోకే ప్రమాదముంది. ఇలా సోకిన ఈ వైరస్ ఎగువ శ్వాసనాళ సమస్యలకు దారితీస్తుంది. అందుకే కొత్త బ్రష్, టంగ్ క్లీనర్ వాడాలని..దాంతోపాటు మౌత్‌వాష్ కూడా మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ మౌత్‌వాష్ కనుక అందుబాటులో లేకపోతే కనీసం వేడిచేసిన సెలైన్ వాటర్‌తో నోటిని తరచూ శుభ్రం చేసుకోవడం మంచిది.

అలాగే కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే వారి టూత్‌బ్రష్, టంగ్ క్లీనర్‌తోపాటు వారు వాడిన టవల్స్ వంటి వాటిని కూడా మిగతా వారి వస్తువులతోను..బట్టల్లోను కలపకుండా వేరేగా కొంత కాలంపాటు ఉంచాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా నిపుణుల సలహాను పాటించడం మేలు అని చెప్తోంది. కరోనా సమయంలో వాడే ఈ వస్తువలపై వైరస్ కణాలు బాగా పేరుకుపోయి ఉండే ప్రమాదం ఉందని, కాబట్టి కరోనా నుంచి కోలుకోగానే వాటిని తొలగించడం మంచిదని సూచించింది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad