Trending

6/trending/recent

Nasal Vaccines : భారత్ లో గేమ్ ఛేంజర్ గా నాజల్ వ్యాక్సిన్లు..చిన్నారులను కరోనా నుంచి రక్షించే అస్త్రమన్న WHO

Nasal Vaccines :  కరోనాకి విరుగుడుగా భారత్ లో తయారవుతున్న నాజల్ వ్యాక్సిన్స్(ముక్కు ద్వారా వ్యాక్సిన్ ఇచ్చేవి) అందుబాటులోకి వస్తే.. కరోనా నుంచి చిన్నారులను రక్షించడంలో అవి ‘గేమ్ ఛేంజర్’లా పనిచేయవచ్చునని శనివారం ఓ ఇంటర్వ్యూలో WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు

Nasal Vaccines కరోనాకి విరుగుడుగా భారత్ లో తయారవుతున్న నాజల్ వ్యాక్సిన్స్(ముక్కు ద్వారా వ్యాక్సిన్ ఇచ్చేవి) అందుబాటులోకి వస్తే.. కరోనా నుంచి చిన్నారులను రక్షించడంలో అవి ‘గేమ్ ఛేంజర్’లా పనిచేయవచ్చునని శనివారం ఓ ఇంటర్వ్యూలో WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. నాజల్ వ్యాక్సిన్లను సులువుగా ఇవ్వొచ్చునని… శ్వాసకోశ సమస్యలకు సంబంధించి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి బాగా పనిచేస్తాయని పేర్కొన్నారు. అయితే భారత్‌లో ఈ ఏడాది నాజల్ వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదన్నారు.

పిల్లలకు సంబంధించి చాలా వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ 12 ఏళ్లు దాటిన వారికి వెయ్యవచ్చని నిరూపించింది. అలాగే… అంతకంటే తక్కువ వయసువారిపై ట్రయల్స్ జరుగుతున్నాయి. మరికొన్ని నెలల్లో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు అనుమతి పొందగలవు. పిల్లలకు సంబంధించి ఆస్త్రాజెనెకా లాంటి వ్యాక్సిన్ల ప్రయోగాలు కాస్త నెమ్మదిగా ఉన్నాయి. భారత్ లో తయారవుతున్న కొన్ని నాసల్ వ్యాక్సిన్లు… గేమ్ చేంజర్లు కాగలవని ఆశిస్తున్నాను. అవి స్థానికంగా తయారవుతున్నాయి కాబ్టటి… స్థానికులకు ఇమ్యూనిటీని పెంచేలా ఉంటాయి. అయితే ఇది ఈ సంవత్సరం అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. 
కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గేంతవరకూ స్కూళ్లను తెరవద్దు. ఇతర దేశాలు కూడా ఇదే పాటిస్తున్నాయి. సామూహిక వ్యాప్తి తగ్గినప్పుడు మనం స్కూళ్లు, యూనివర్శిటీలూ తెరచుకోవచ్చు. నాజల్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే లోగా దేశంలోని టీచర్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వగలిగితే కోవిడ్‌ పై పోరాటంలో అది కీలకంగా మారుతుందని సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు.
భారత్‌లో కరోనా మూడో వేవ్ చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాజల్ వ్యాక్సిన్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం భారత్‌లో హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ సంస్థ ఈ నాజల్ వ్యాక్సిన్లను అభివృద్ది చేస్తోంది. సాధారణ వ్యాక్సిన్లలా కాకుండా ఈ వ్యాక్సిన్‌ను ముక్కు ద్వారా ఇస్తారు. ఇవి అందుబాటులోకి వస్తే వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంటి వద్దే ఎవరికి వారు ఈ వ్యాక్సిన్‌ డ్రాప్స్‌ను ముక్కులో వేసుకోవచ్చు. ముక్కులోని శ్లేష్మ పొరల్లో ఉన్న వైరస్‌ను ఇది అంతం చేస్తుంది. సాధారణంగా కరోనా వైరస్ ముక్కులోని శ్లేష్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముక్కు ద్వారా ఇచ్చే నాజల్ వ్యాక్సిన్ల ద్వారా వైరస్‌ను శ్లేష్మ పొరల్లోనే నిర్మూలించే అవకాశం ఉంటుంది.

ఇక,ఇండియాలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ ప్రారంభంలో జోరుగా ఉన్నా…ఇప్పుడు కాస్త మందగించిందనే అంశంపై సౌమ్య స్వామినాథన్ అభిప్రాయం కోరగా… ఆమె తనదైన విశ్లేషణ చేశారు. ఇండియాలో సమస్య సప్లైతో ఉంది. ఇండియాలో కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం అహరహం కృషి చేస్తున్నాయి. నాకు తెలుసు… ఇందుకు టైమ్ పడుతుంది. మరికొన్ని నెలల్లో మనం మార్పు చూస్తాం. కోవిషీల్డ్, కోవాగ్జిన్ మాత్రమే కాదు… ఇతర వ్యాక్సిన్లు కూడా ఇండియాలో తయారవుతాయి. విదేశీ వ్యాక్సిన్లు ఆగస్ట్, సెప్టెంబర్ సమయంలో ఇండియాలోకి వస్తాయి. అప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత జోరందుకుంటుంది. ఈలోగా ఏం చెయ్యాలంటే… గ్రూపుల వారీగా ప్రాధాన్యాలు రెడీ చేసుకోవాలి. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే 45 ఏళ్లు దాటిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. సప్లై తక్కువగా ఉన్నప్పుడు ఎవరికైతే వ్యాక్సిన్ అత్యవసరమో వారికి వేసేలా ప్రాధాన్యాలు ఉండాలని ఆమె అన్నారు.




Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad