Trending

6/trending/recent

Electricity Bill: ఏసీ వల్ల కరెంట్‌ బిల్లు పెరిగిపోతోందా.. అయితే ఈ 5 మార్గాల్లో తగ్గించుకోండి..!

వేసవి వచ్చేసింది. సూర్యుడు భగభగలు మొదలైపోయాయి. ఆ వేడి తాపాన్ని చల్లార్చేందుకు ఫ్యాన్ వేగం సరిపోదు.. ఏసీ ఉండాల్సిందేనని కొందరు అనుకుంటారు.

Electricity Bill: ఏసీ వల్ల కరెంట్‌ బిల్లు పెరిగిపోతోందా.. అయితే ఈ 5 మార్గాల్లో తగ్గించుకోండి..!

Electricity Bill: ఏసీ వల్ల కరెంట్‌ బిల్లు పెరిగిపోతోందా.. అయితే ఈ 5 మార్గాల్లో తగ్గించుకోండి..! 

వేసవి వచ్చేసింది. సూర్యుడు భగభగలు మొదలైపోయాయి. ఆ వేడి తాపాన్ని చల్లార్చేందుకు ఫ్యాన్ వేగం సరిపోదు.. ఏసీ ఉండాల్సిందేనని కొందరు అనుకుంటారు. అయితే సమ్మర్‌లో 24 గంటలు ఎయిర్ కండీషనర్(ఏసీ) వేస్తే కరెంటు బిల్లు మాత్రం వాచిపోతుంది. మరి ఏసీ ఎక్కువసేపు రన్ అయినా.. కరెంట్‌ బిల్లు తక్కువ రావాలంటే.. తప్పనిసరిగా కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. అవేంటో తెలుసుకుందామా.?

  •  ACని సరైన టెంపరేచర్ వద్ద సెట్ చేయండి:  AC టెంపరేచర్ ఒక నిర్దిష్ట డిగ్రీల వద్ద సెట్ చేయడం మర్చిపోవద్దు. వాస్తవానికి తక్కువ టెంపరేచర్ వద్ద ఏసీని రన్‌ చేయకూడదు.15 నుంచి 16 డిగ్రీల వద్ద ఏసీని సెట్ చేస్తే.. కరెంటు బిల్లు వాచిపోతుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రకారం.. ACని 24 డిగ్రీల వద్ద సెట్ చేయాలి. ఈ ఉష్ణోగ్రత మన శరీరానికి ఉత్తమమైనది. అలాగే కరెంటు బిల్లు కూడా ఎక్కువగా రాదు.
  • పవర్ బటన్‌ను ఆఫ్ చేయడం మర్చిపోవద్దు: ఒకవేళ ఏసీని ఆఫ్ చేసినప్పుడు.. కచ్చితంగా పవర్ బటన్‌ కూడా ఆఫ్‌లో ఉందా.? లేదా.? అన్నది చూసుకోవాలి. చాలామంది రిమోట్‌తో ఏసీని ఆఫ్ చేసి పవర్ బటన్‌ను మాత్రం అలా వదిలేస్తారు. దీని వల్ల అనవసరంగా కరెంటు ఖర్చవుతుంది. బిల్లు కూడా పెరుగుతుంది. దీన్ని సేవ్ చేయాలంటే.. రిమోట్ ద్వారా ఏసీ ఆఫ్ చేయడంతో పాటు.. పవర్ బటన్‌ను ఆఫ్ చేయాలి.
  • ఏసీలో టైమర్‌ సెట్‌ చేయండి: ఈ రోజుల్లో అన్ని ఏసీలకు టైమర్ ఉంటోంది. రాత్రిపూట AC టైమర్‌ని సెట్ చేయడం మంచిది. అలా చేస్తే.. గది పూర్తిగా చల్లబడిన వెంటనే.. టైమర్ ప్రకారం ఏసీ దానంతట అదే ఆగిపోతుంది. దీంతో కరెంట్ ఆదా చేయవచ్చు. తద్వారా బిల్లు కూడా తగ్గుతుంది.
  • AC సర్వీసింగ్‌: ఎలక్ట్రికల్ గాడ్జెట్ల ఏవైనా కూడా.. వాటిని వినియోగిస్తే సరిపోదు.. సర్వీసింగ్ చేయడమూ చాలా ముఖ్యం. ఎలప్పుడూ పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉన్న గాడ్జెట్లు ఎక్కువ కాలం పని చేస్తాయి. కరెంట్‌ను ఆదా చేస్తాయి. ఏసీ కూడా అంతే!.. ఏసీలో దుమ్ము పేరుకుపోతే అది పనిచేయకుండా పోతుంది. అందుకే ఏసీ సర్వీసింగ్.. నిర్దిష్ట సమయానికి కచ్చితంగా చేయించాలి. అలా చేస్తేనే కరెంట్‌ బిల్లు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.
  • తలుపులు-కిటికీలు మూసి ఉంచండి: ఏసీ ఆన్ చేసే ముందు తలుపులు, కిటికీలు మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలి. బయటి గాలి లోపలికి వచ్చినా, లోపలి గాలి బయటకు వెళ్లినా ఏసీ ఆన్‌ చేసి వేస్ట్‌. అనవసరంగా కరెంటు ఖర్చు పెరుగుతుంది. గది చల్లబరచడానికి ఎక్కువ సమయం పడుతుంది.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad