Trending

6/trending/recent

Teachers Rationalization Reapportion Revised Rules - Orders - Complete Information

Teachers Rationalization Reapportion Revised Rules - Orders - Complete Information
Teachers Rationalization Reapportion Revised Rules - Orders - Complete Information

Orders Soon....Check Back Again

  • పాఠశాలల విలీన జీవోపై సవరణ ఉత్తర్వులు
  • ఉపాధ్యాయ సంఘాలతో వారి సమస్యలపై చర్చలు
  • ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

వెలగపూడి : పాఠశాలల విలీన జీవోపై అభ్యంతరాలను పరిశీలించి సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో వారి సమస్యలపై చర్చలు జరిపిన మంత్రి పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విధానంపై వెనక్కి తగ్గేది లేదన్నారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమానికే కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన మంత్రి.. పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో 117 రద్దు సహా, ఉపాధ్యాయ బదిలీలపై చర్చించారు. పాఠశాలల విలీన జీవోపై అభ్యంతరాలను పరిశీలించి సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి బొత్స వెల్లడించారు.

ఉపాధ్యాయ సంఘాల సమస్యలపై వారితో చర్చించామని,  సానుకూల నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.  జీవో నెం.117లోని అభ్యంతరాలను పరిశీలించి సవరణ ఉత్తర్వులు. పాఠశాలల్లో అంగ్ల మాధ్యమం విధానంపై వెనక్కి తగ్గేదిలేదన్నారు. 1 నుంచి 8 వరకు నిర్బంధ ఆంగ్ల విద్య అమలు చేస్తామని,  3, 4, 5 తరగతుల విద్యార్థులు ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తామని, 21 మంది విద్యార్థులు ఉన్నచోట ఇద్దరు ఎస్జీటీలు ఉంటారని తెలిపారు. ఇవాళ సాయంత్రం లేదా రేపటిలోగా సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం చెప్పినట్లు ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. ప్రభుత్వ నిర్ణయం తర్వాత డీఈవో కార్యాలయాల ముట్టడికి ఇచ్చిన పిలుపుపై పునరాలోచన చేస్తామని ఫ్యాప్టో ఛైర్మన్‌ ప్రకటించారు.

విద్యాశాఖ మంత్రి గారితో ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో చర్చించిన అంశాలు :

➧ జి.ఓ. నం.117కు ఈ రోజు లేక రేపు మార్పులు చేసి ఉత్తర్వులు ఇస్తారు

➧  ప్రాథమిక పాఠశాలల్లో 1:20గా చూస్తారు. 21 రోల్ దాటితే 2వ పోస్టు ఇస్తామన్నారు.

➧ ఎల్ఎఫ్ఎల్ హెచ్.ఎం. పోస్టు 150 రోల్ పైన ఉన్న పాఠశాలకు ఇస్తారు.

➧ ఎన్ రోల్ మెంట్ తేదీని 05.05.2022గానే ఉంచారు.

➧ హైస్కూల్ లో 2వ హిందీ టీచర్ పోస్టు 10 సెక్షన్ వద్ద ఇస్తారు.

➧ ప్రీ హైస్కూల్స్ లో 98 రోల్ పైన ఉన్న చోట 6గురు స్కూల్ అస్టిస్టెంట్లు 1 పిఇటిని ఇస్తారు.

➧ రాష్ట్రంలోని హైస్కూల్స్ లో 998 హెచ్.ఎం. పోస్టులు అప్ గ్రేడేషన్ కోసం ఫైనాన్స్ కి ఫైల్ పెట్టారు.

➧ స్కూల్ అసిస్టెంట్  5419 పోస్టులు అప్ గ్రేడేషన్ కోసం ఫైనాన్స్ కి ఫైల్ పెట్టారు.

➧ రాష్ట్రంలో 2342 ఎస్.ఏ. పోస్టులు తత్సమాన పోస్టులకు కన్వర్షన్ ఇస్తున్నారు.

➧ అన్ని హైస్కూల్స్ కి హెచ్.ఎం. మరియు పి.డి. పోస్టు ఇస్తారు.

➧ అన్ని వసతులున్న చోట మాత్రమే మెర్జింగ్ చేస్తారు.

➧ ఏ ఉపాధ్యాయునికి 36 పీరియడ్లు పైబడి ఉండవు.

➧  ప్రభుత్వం నుంచి సిఫార్సు బదిలీలు ఉండవు.

➧ జీరో సర్వీసుతో బదిలీలు చేస్తారు.

➧ కట్ ఆఫ్ డేట్:30:06:2022 జులై నెలాఖరుకు మార్చాలని కోరాము.

➧ Maximum sevice:5 years for all cadres, Nc teachers కు కూడా.

➧ హెచ్ఎంలకు తప్ప మిగిలిన అన్ని క్యాడర్లకు 8 సం.లు ఉండాలని కోరాము.

➧ 2021 జనవరిలో transfer అయి ప్రస్తుతం rationalization కు గురయ్యే టీచర్లకు పాత స్టేషన్ పాయింట్స్ ఇస్తారు.

➧ మ్యాపింగ్ వలన ఎఫెక్ట్ అయ్యేవారికి మాత్రమే స్పెషల్ పాయింట్స్ ఇస్తారు. మిగిలిన వారికి రేషనలైజేషన్ పాయింట్లు లేవు

➧ Against PD పోస్టులలో పనిచేసే PET లు కూడా బదిలీ చేస్తారు. 

➧ హైస్కూల్స్ లో 1:60 కాకుండా 1:45గా ఉండాలని ప్రాతినిధ్యం చేసాం.

➧  అన్ని కేడర్ల వారికి ఆన్ లైన్ లోనే బదిలీలు జరుగుతాయి.

 ➧ MEO లకు బదిలీలు ఉండవన్నారు

 ➧ సీనియార్టీని స్కూల్ base గా కాకుండా స్టేషన్ base గా (పంచాయతీ) బదిలీలు ఉంటాయి.

➧ ఆన్లైన్ విధానంలో పొరపాటు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారు.

➧ ఓ.హెచ్ .,వి.హెచ్. వారికి 80% ఉంటేనే పరిగణిస్తారు

➧ వినికిడి సమస్యలు ఉన్నవారిని పరిగణించరు

➧ ఉర్దూ మీడియం పాఠశాలలో పనిచేసే తెలుగు ఉపాధ్యాయుల అంశం పరిశీలిస్తామన్నారు

➧ సింగిల్ మీడియా మాత్రమే ఉంటుంది తెలుగు మాధ్యమం ఉండదు అని చెప్పారు

➧ ఎస్జీటీ పోస్టులు అదనంగా ఉన్న పాఠశాలలో బ్లాక్ చేస్తారు.

➧ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అదనంగా ఉన్నప్పటికీ బ్లాక్ చేయరు

➧ సర్ ప్లస్ గా ఉన్న పోస్టులలో 2814 పోస్టులను కర్నూలు జిల్లాకు షిఫ్ట్ చేసి అప్గ్రేడ్ చేస్తారు

➧ పాతజిల్లాల ప్రాతిపదికన బదిలీలు ఉంటాయి

SOURCE : SOCIAL MEDIA

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad