Trending

6/trending/recent

Godavari Bridge: ఏపీలో మరో బెస్ట్ టూరిస్ట్ స్పాట్.. గోదారమ్మ మణిహారానికి అదనపు హంగులు

గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సినిమాల షూటింగ్ లు కూడా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనే ఎక్కువ జరుగుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు (Pan India Movies) కూడా కొంత భాగం ఇక్కడే రూపుదిద్దుకుంటున్నాయి. అందుకు ప్రధాన కారణం ఇక్కడి పర్యాటక ప్రాంతాలే.. ఇప్పుడు మరో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ రాబోంది.

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పర్యాటక ప్రాంతాలు (AP Tourist Spots) ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే చాలా పర్యాటక ప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సినిమాల షూటింగ్ లు కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ జరుగుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు కూడా కొంత భాగం ఇక్కడే రూపుదిద్దుకుంటున్నాయి. అందుకు ప్రధాన కారణం ఇక్కడి పర్యాటక ప్రాంతాలే.. ఇప్పుడు మరో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ రాబోంది. అదే హేవలాక్ బ్రిడ్జి. గోదావరి నది (Godavari River) కి ఒక హారంలా గుర్తింపు పొందిన ఈ బ్రిడ్జి ఎన్నో సేవలందించి.. తరువాత విశ్రాంతి తీసుకుంది. అప్పటి నుంచి దీన్ని ఒక స్మారక కట్టడంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు డిమాండ్ చేస్తూనే వస్తున్నారు.

గత టీడీపీ హాయాంలో ఈ బ్రిడ్జిని సుందరంగా తీర్చిదిద్ది, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రతిపాదనలు రెడీ చేసింది. అంతేకాదు ఈ బ్రిడ్జి కోసం.. ఏకంగా రైల్వే శాఖకు 10 కోట్ల రూపాయలు చెల్లించి మరీ స్వాధీనం చేసుకుంది. ఈలోపు ఎన్నికలు రావడం తో కొంతకాలం ఈ ప్రతిపాదన మూలనపడింది. అయితే ఇప్పుడు స్థానికులు కోరిక నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. 12 కోట్లతో దీన్ని అభివృద్ధి చేయడంతోపాటు 4 స్పాన్ల మేర ఫుడ్‌ కియోస్క్‌, ఈటరీస్టాల్స్‌, షాపులు, ముగ్గురేసి కూర్చోవడానికి బెంచీలు ఉండేలా సరికొత్ డిజైన్ ను ఫైనల్ చేసినట్టు టాక్. ఇప్పటికే దీనికి సంబంధించి టెండర్లు పిలిచారు. ఈనెల 24వ తేదీ ఆఖరిరోజు. మరి ఎంతమంది ముందుకొస్తారో చూడాలి.

మున్సిపాల్టీలో కూడా పనులకు టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదు. కానీ ప్రజల చిరకాల కోరికైన ఈ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా మార్చ డం త్వరగా పూర్తవ్వాలని ప్రజలు కోరుతున్నారు. సుమారు 122 ఏళ్ల వయస్సున్న ఈ బ్రిడ్జిని కాపాడుకోవాలని స్థానిక ప్రజలు, రాజకీయనేతలు, వివిధ ప్రజాసంఘాలు ఎప్పటినుంచో పోరాడుతున్నాయి. మరి వారి పోరటం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

రాజమహేంద్రవరం- కొవ్వూరు మధ్య గోదావరి మీద 1900లో హేవలాక్‌ బ్రిడ్జిని ప్రారంభించారు. నిర్మాణ తేదీతో కలు పుకుంటే.. 1997కు వందేళ్లు పూర్తయ్యాయి. కానీ గతంలోనే ఈ బ్రిడ్జిపై రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఈ బ్రిడ్జిని 2,754 మీటర్ల పొడవున 56 స్పాన్లను రాళ్లతోనూ, స్టీల్‌ గిర్డర్స్‌తోను నిర్మించారు. అప్పట్లో రైల్వేశాఖ దీనిని కూల్చేసి, స్టీల్‌ను అమ్మేసుకోవాలని ప్రయత్నిం చగా ప్రజలు అడ్డుకున్నారు. గత పుష్కరాల సందర్భంగా దీన్ని నైట్‌ బజార్‌ గానూ, వాకింగ్‌ ట్రాక్‌ గానూ మార్చాలని ప్రయత్నించిది గత టీడీపీ ప్రభుత్వం. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టులో భాగంగా డిజైన్లు కూడా తయారు చేశారు. తర్వాత ప్రభుత్వ మారడంతో ఎవరూ పట్టిం చుకోలేదు. ఎంపీ మార్గాని భరత్‌ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పలు పనుల కోసం 125 కోట్లు మం జూరు చేస్తూ 2021లో జీవో ఇచ్చింది. అందులో హేవలాక్‌ అభి వృద్ధికి 12 కోట్లు కేటాయించింది. ఆ వెంటనే ఏపీ టూరిజం అధికారులు డిజైన్లు సిద్ధం చేసి టెండర్లు పిలిచారు. గతేడాది డిసెంబరు 27 జీవో నంబరు 722ను జారీచేసింది. అందులో భాగంగా టూరిజం తర పున హేవలాక్‌ బ్రిడ్జికి 12 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది టెండర్లు పిలిచారు.. స్థానికుల డిమాండ్ మేరకు ఎవరైనా ముందుకు వచ్చి.. ప్రాజెక్టును త్వరితగతిని చేపడితే.. ఏపీలో మరో సుందర పర్యాటక ప్రాంతం వెలుగులోకి వచ్చినట్టే..!

Godavari Bridge: ఏపీలో మరో బెస్ట్ టూరిస్ట్ స్పాట్.. గోదారమ్మ మణిహారానికి అదనపు హంగులు

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad