Trending

6/trending/recent

DA Arrears : డీఏ ఎరియర్స్‌కు దిక్కేదీ!

  • సరెండర్‌లీవ్‌కు కూడా మంగళమేనా?..
  • భయాందోళనలో ఉద్యోగులు, టీచర్లు
  • సుమారు రూ.10 వేల కోట్ల బకాయిలు..
  • ఒక్కో ఉద్యోగికి 50 వేలు-2 లక్షలదాకా బాకీ
  • ఆర్థిక సంవత్సరం ముగిసిందంటూ వెనక్కి..
  • మళ్లీ బిల్లులు పంపబోతే ఆగిన అప్‌లోడ్‌

జగన్‌ సర్కార్‌ ప్రభుత్వ ఉద్యోగుల మీద కక్ష కట్టిందా? పోరాటాల ద్వారా సాధించుకున్న డీఏ ఎరియర్స్‌, సరెండర్‌లివ్‌ వంటి హక్కులను తొలగిస్తోందా? రాష్ట్ర వ్యాప్తంగా  సుమారు 10 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లతో చెలగాటం ఆడుతోందా?.. అంటే అవుననే అంటున్నాయి ఉద్యోగవర్గాలు! పేరోల్స్‌.హెర్బ్‌. ఏపీసీఎ్‌ఫఎ్‌సఎస్‌ సైట్‌లో గతంలో ఉన్న సరెండర్‌ లీవ్‌ ఆప్షన్‌ను ప్రభుత్వం తొలగించింది. సరెండర్‌ లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ బిల్లులు, డీఏ ఎరియర్స్‌ బిల్లులను ఆర్థిక సంవత్సరం ముగిసిన దృష్ట్యా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ డీడీవోలకు ప్రభుత్వం తిప్పి పంపింది. ఉద్యోగులు మళ్లీ బిల్లులను దరఖాస్తు చేయబోతే బడ్జెట్‌ ఇన్‌షఫిషియంట్‌ ఫండ్‌ అంటూ మెసేజ్‌లు వస్తున్నా యి. దీంతో ఉద్యోగులు మండిపడుతున్నారు. డీఏలు, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ బడ్జెట్‌ అంశం కాదు. అయినా... ఇలా మెసేజ్‌లు రావడం ఏమిటని మండిపడుతున్నా రు. తాము ఎన్నో నెలల క్రితం పెట్టిన బిల్లులను ఇయర్‌ ఎండింగ్‌ వరకు చెల్లించకుండా నెలల తరబడి పేరబెట్టారు. ఇప్పుడేమో ఆర్థిక సంవత్సరం అయిపోయింది.. మళ్లీ పంపమని డీడీవోలకు తిప్పిపంపారు. ఉద్యోగులకు బకాయిలు చెల్లించడం ఇష్టం లేకే ప్రభు త్వం ఇలా చేస్తోందని మండిపడుతున్నారు. 

తొలినుంచీ చెలగాటమే..జగన్‌ సర్కారు ఉద్యోగులతో చెలగాటం ఆడుతోంది. సకాలంలో జీతాలు, పెన్షన్‌ చెల్లించిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. 1న జీతం చెల్లిస్తున్నామని చెప్పడానికి కొద్ది మందికి ఆ తేదీన వేతనాలు వేస్తూ మిగిలి న ఉద్యోగులకు నెలలో మొదటి వారం వరకూ సాగదీస్తోంది. పెన్షనర్లకు 10, 15 తేదీల్లో పెన్షన్‌ పడిన సందర్భాలు కోకొల్లలు. అదేమంటే సీఎ్‌ఫఎంఎస్‌, హెర్బ్‌ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు తలెత్తాయంటూ సాకులు చెబుతోంది. జీతాల మాట అటుంచితే.. ఉద్యోగులకు చెల్లించాల్సిన ఏపీజేఎల్‌ఐ, డీఏ ఎరియర్స్‌, సరెండర్‌ లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌, జీపీఎఫ్‌ బకాయిలు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్‌ కూడా నెలల తరబడి మంజూరు చేయడం లేదు.  

ఖాతాలో వేయలేదు.. నగదూ ఇవ్వలేదు..డీఏ ఎరియర్స్‌ బకాయిలను ఓపీఎస్‌ ఉద్యోగులకు జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేయాలి. సీపీఎస్‌ ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లించాలి. ఇప్పటి వరకు 2018 జూలై, 2019 జనవరి డీఏలకు సీపీఎస్‌ ఉద్యోగులకు నగదు చెల్లింపులు జరగలేదు. ప్రభుత్వంలో వె కేషన్‌, నాన్‌ వెకేషన్‌ డిపార్ట్‌మెంట్టు ఉంటాయి. వెకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ పరిధిలోకి ఉపాధ్యాయులు వస్తే...నాన్‌ వెకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ కిందకు వివిధ శాఖల ఉద్యోగులు వస్తారు. అయితే...ఏడాదికి వెకేషన్‌ డిపార్ట్‌మెం ట్‌ పరిధిలో ఆరు, నాన్‌ వెకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులకు 30 వరకు సరెండర్‌ లీవ్‌లు ఉంటాయి. వాటిని ఉద్యోగులు నగదుగా మార్చుకోవచ్చు. అయితే గత రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం సరెండర్‌ లీవ్‌లకు సంబంధించిన బిల్లులను ఆమోదించడంలేదు.  

11వ పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ఉద్యోగ సం ఘాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం విడుదల కావాల్సిన జీవోల్లో కొన్ని ఇంకా వెలువడలేదు. డీఏ ఎరియర్స్‌ రికవరీపై స్పష్టత రాలేదు. జీవోలు రాలేదు. 1.4.2020 నుంచి 31.12.2021 మధ్య కాలానికి సంబంధించి ఐఆర్‌, హెచ్‌ఆర్‌ఏ., సీసీఏ రికవరీల మీద స్పష్టతతో కూడిన జీవోల ఊసే లేదు. ఐదు సంవత్సరాల పీఆర్సీకి సంబంధించి జీవో ఇప్పటికీ విడుదల కాలేదు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad