Just In

6/trending/recent

Ads Area

Netflix: త్వరలో నెట్‌ఫ్లిక్స్‌ ఖాతా షేరింగ్‌పై నిషేధం!

 వాషింగ్టన్: నెట్‌ఫ్లిక్స్‌ షేర్ల విలువ మంగళవారం అమెరికాలో 25 శాతం మేర పడిపోయాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా చందాదారుల సంఖ్య గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం. నెట్‌ఫ్లిక్స్‌కు ఇక మంచి రోజులు ముగిశాయన్న విశ్లేషణలు వెలువడుతుండడం గమనార్హం.

Netflix: త్వరలో నెట్‌ఫ్లిక్స్‌ ఖాతా షేరింగ్‌పై నిషేధం!

మార్చితో ముగిసిన త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌ చందాదారుల సంఖ్య ఏకంగా రెండు లక్షలు తగ్గి 22.16 కోట్లకు చేరింది. నెట్‌ఫ్లిక్స్‌ సేవలు ప్రారంభమైన తర్వాత సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి.

ఏప్రిల్‌-జూన్‌లో మరో 20 లక్షల చందాదారులను కోల్పోయే ప్రమాదం ఉందని నెట్‌ఫ్లిక్స్‌ త్రైమాసిక ఫలితాల్లో అంచనా వేసింది. దీంతో సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలు మరింత తీవ్రం కానున్నాయని సంస్థ స్వయంగా ప్రకటించింది.

బుధవారం కూడా నెట్‌ఫ్లిక్స్‌ షేర్ల పతనం కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఈ ఏడాది కంపెనీ షేర్ల విలువ సగానికి పైగా పడిపోయినట్లవుతుంది. కేవలం 4 నెలల కంటే తక్కువ వ్యవధిలో 150 బిలియన్‌ డాలర్ల మదుపర్ల సంపద ఆవిరైనట్లవుతుంది.

చందాదారుల సంఖ్య భారీగా పడిపోతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధమవుతోంది. గతంలో నిరాకరించిన అనేక సంస్కరణలను తాజాగా అమలు చేసే యోచనలో ఉంది. ఖాతాను ఇతరులతో పంచుకునే వెసులుబాటును నిషేధించనుంది. ఫలితంగా ఒకే అకౌంట్‌తో పలువురు సేవల్ని వినియోగించుకునే అవకాశం ఉండదు. అలాగే తక్కువ ధరలో ప్రకటనలతో కూడిన కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది కల్లా ఈ మార్పులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని సీఈఓ రీడ్‌ హేస్టింగ్‌ తెలిపారు.

2011లో నెట్‌ఫ్లిక్స్‌ ఏకంగా 8 లక్షల మంది చందాదారులను కోల్పోయింది. తొలుత ‘డీవీడీ-బై-మెయిల్‌ సర్వీస్‌’ సేవల్ని పొందేవారికి స్ట్రీమింగ్‌ సేవల్ని నెట్‌ఫ్లిక్స్‌ ఉచితంగా అందించేది. 2011లో తొలిసారి స్ట్రీమింగ్‌కు కూడా డబ్బులు వసూలు చేయనున్నట్లు ప్రకటించడంతో సబ్‌స్క్రైబర్లు భారీగా తగ్గారు. ఫలితంగా సీఈఓ రీడ్‌ హేస్టింగ్‌ క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది.

వాస్తవానికి మార్చితో ముగిసిన త్రైమాసికంలో తమ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2.5 మిలియన్ల మేర పెరగొచ్చని నెట్‌ఫ్లిక్స్‌ గతంలో అంచనా వేసింది. కానీ, అందుకు భిన్నమైన స్పందన రావడం గమనార్హం. చందాదారుల సంఖ్య తగ్గడంతో నెట్‌ఫ్లిక్స్‌ లాభాలు 6% తగ్గి 1.6 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఆదాయం మాత్రం 10% పెరిగి 7.9 బిలియన్‌ డాలర్లకు చేరింది.

కొవిడ్‌ సంక్షోభం నుంచి క్రమంగా పరిస్థితులు చక్కబడుతుండడంతో నెట్‌ఫ్లిక్స్‌ సేవల వినియోగం తగ్గిపోయింది. వినియోగదారులు ఇతర పనులకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఫలితంగా వీడియోలు చూసే తీరిక తగ్గింది. ఇది చందాదారుల సంఖ్య తగ్గడానికి ఓ కారణం. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిరసిస్తూ రష్యాలో సేవల్ని నిలిపివేయడం కూడా ప్రభావం చూపింది.

Netflix: త్వరలో నెట్‌ఫ్లిక్స్‌ ఖాతా షేరింగ్‌పై నిషేధం!

 

    యాపిల్‌, వాల్ట్‌ డిస్నీ వంటి ప్రత్యర్థి సంస్థల నుంచి నెట్‌ఫ్లిక్స్‌కు పోటీ తీవ్రమైంది. మరింత మంది సబ్‌స్క్రైబర్లను ఆకర్షించడంలో భాగంగా ఆయా సంస్థలు అనేక ఆకర్షణీయ పథకాలను ప్రవేశపెడుతున్నాయి.

    ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది ఉచితంగా తమ సేవల్ని వీక్షిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. స్నేహితులు, సన్నిహితులు సహా తెలిసినవారి అకౌంట్‌ను వాడుతూ వారు వీడియోలను వీక్షిస్తున్నారని పేర్కొంది. ఇది కూడా తమ సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గడానికి కారణమవుతోందని వెల్లడించింది. అయితే, వీరంతా తమ సేవల్ని ఇష్టపడుతున్నారని.. వారికి కూడా చేరువయ్యేందుకు మరింత అందుబాటు ధరలో పథకాలను తీసుకొస్తామని పేర్కొంది.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad