Trending

6/trending/recent

New Districts - Post Allocation Draft Guidelines in Telugu : కొత్త జిల్లాలు ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు మార్గదర్శకాలు తెలుగు లో

New Districts - Post Allocation Draft Guidelines in Telugu : కొత్త జిల్లాలు ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు మార్గదర్శకాలు తెలుగు లో 

New Districts - Post Allocation Draft Guidelines in Telugu

న్యూస్ టోన్, అమరావతి : జిల్లాల పునర్విభజన జరుగుతున్న ఈ సందర్భంగా దానికి తగిన విధంగా కొత్తగా ఏర్పాటు కాబోతున్న జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు కూడా జరగాల్సి ఉంటుంది. దీని కోసం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఉగాది నుండి ఏర్పాటు కాబోయే నూతన జిల్లాల్లో ఏర్పాటు కాబోయే కార్యాలయాల్లో ఉద్యోగుల తాత్కాలిక కు కేటాయింపు కొరకు అధికారులు డ్రాఫ్ట్ ఉత్తర్వులను సిద్ధం చేశారు. ఈ ఉత్తర్వులు లోని అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఏ. ముఖ్య సూత్రాలు

పోస్టుల తాత్కాలిక కేటాయింపు

  • రాష్ట్రస్థాయి, రీజనల్/ జోనల్ స్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి పోస్టులను ఈ తాత్కాలిక కేటాయింపు కొరకు పరిగణన లోనికి తీసుకోరు.
  • జిల్లాస్థాయి, డివిజనల్ స్థాయి పోస్టులను మాత్రమే తాత్కాలిక కేటాయింపు కొరకు పరిగణన లోనికి తీసుకుంటారు.
  • తక్కువ పోస్టులు ఉన్న జిల్లాస్థాయి, డివిజనల్ స్థాయి పోస్టులను ఈ తాత్కాలిక కేటాయింపు కొరకు పరిగణన లోనికి తీసుకోరు. ఇటువంటి పోస్టులు విషయంలో ఆర్థిక శాఖ వివిధ శాఖల అధికారులతో సంప్రదించిన మీదట తుది నిర్ణయం తీసుకుంటుంది.
  • ఉద్యోగులు కొత్తగా కేటాయించిన జిల్లాలో వారికి కేటాయించిన తాత్కాలిక స్థానాల్లో వారి విధులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఉద్యోగుల సీనియార్టీ లో ఏ విధమైన మార్పులు ఉండవు.
  • ఈ తాత్కాలిక కేటాయింపు ప్రక్రియ ఏ విధమైనటువంటి జిల్లాస్థాయి డివిజనల్ స్థాయి పోస్టులు కొత్తగా సృష్టించబడవు. న్యూస్ టోన్

ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు

  • ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు ఆయా శాఖల హెచ్ ఓ డి లు ఆ శాఖలకు ఉన్నటువంటి సాధారణ బదిలీలకు ఉన్న నిబంధనల ప్రకారం రివర్స్ సీనియార్టీ ద్వారా చేస్తారు. ఈ నిబంధనలు జీవో 59 ప్రకారం జరుగుతాయి. న్యూస్ టోన్

ఆర్డర్ టు సర్వ్ ద్వారా తాత్కాలిక కేటాయింపు

  • తాత్కాలిక కేటాయింపు పరిధిలోకి రాణి మిగిలిన ఉద్యోగులు అందరూ వారు ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయాల్లో నే ఆర్డర్ టు సర్వ్ ద్వారా తాత్కాలిక కేటాయింపు గా కొనసాగుతారు. తుది కేటాయింపు తదుపరి జారీచేసే ఉత్తర్వుల ప్రకారం ఉంటుంది.
  • ఈ పద్ధతిలో తాత్కాలిక కేటాయింపు జరిగిన వారు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఆయా కార్యాలయాల్లో కొనసాగుతారు. వారి తుది కేటాయింపు తర్వాత జారీ చేసే ఉత్తర్వులకు లోబడి ఉంటుంది.
  • వీరి కేటాయింపులు అన్ని పూర్తిగా తాత్కాలికంగా ఉంటాయి. న్యూస్ టోన్

బదిలీలపై నిషేధం ఎత్తివేత మరియు ఇతరాలు

  • తాత్కాలిక కేటాయింపులు భాగంగా ఉద్యోగులు ఒక కార్యాలయం నుండి మరొక కార్యాలయానికి మారాల్సి ఉంటుంది అందున బదిలీలపై నిషేధం ఎత్తివేస్తారు.
  • అమలులో ఉన్న నిబంధనల ప్రకారం వారికి అర్హత కలిగిన ట్రావెలింగ్ అలవెన్స్ మంజూరు చేస్తారు. న్యూస్ టోన్

కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కేటాయింపు

  • మిగిలిన ఉద్యోగులు లాగానే వీరిని కూడా తాత్కాలిక కేటాయింపు చేస్తారు.
  • ఆయా శాఖల అధిపతులు దీనికి బాధ్యులు గా ఉంటారు
  • అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఈ కేటాయింపు ఏపీ సి ఓ ఎస్ డేటాబేస్ ప్రకారం మాత్రమే జరుగుతాయి
  • అన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు మంజూరు చేయబడిన పోస్టుల కు మ్యాప్ చేయబడతాయి. న్యూస్ టోన్

ఈ డ్రాఫ్ట్ ఉత్తర్వులు లోని ఇతర ముఖ్యాంశాలు

  • జిల్లా కార్యాలయంలో తాత్కాలిక కేటాయింపు కొరకు పద్ధతి
  • డివిజనల్ కార్యాలయంలో తాత్కాలిక కేటాయింపు కొరకు పద్ధతి
  • తాత్కాలిక కేటాయింపు పద్ధతి పూర్తి వివరణ. న్యూస్ టోన్
మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేసి డ్రాఫ్ట్ ఉత్తర్వుల కాపీ ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఈ జీవో కాపీని చదవడానికి కిందకి స్క్రోల్ చేయండి
[post_ads]

New Districts - Post Allocation Draft Guidelines in Telugu : కొత్త జిల్లాలు ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు మార్గదర్శకాలు తెలుగు లో


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad