Redgram Dal Distribution as Dry Ration
న్యూస్ టోన్, అమరావతి: కరోనా నేపథ్యంలో 2021-2022 విద్యాసంవత్సరంలో పాఠశాలలు ఆగస్టు నుండి ప్రారంభం అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పాఠశాలల విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం డ్రై రేషన్ ద్వారా విద్యార్థులకు బియ్యం, గుడ్లు, చిక్కీ, రెడ్ గ్రామ్ దాల్ ను పంపిణీ చేస్తుంది.
దీనిలో భాగంగా జూన్ 12వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు విద్యార్థులకు రెడ్ గ్రామ్ దాల్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీని మేరకు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 1.5 కేజీల రెడ్ గ్రామ్ దాల్ అదేవిధంగా ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల విద్యార్థులకు 2.5 కేజీల రెడ్ గ్రామ్ దాల్ అందజేస్తారు సదరు ఉత్తర్వుల్లో రెడ్ గ్రామ్ దాల్ నాణ్యత ప్యాకింగ్ పాటించవలసిన ప్రమాణాలు పేర్కొన్నారు. ఇక్కడ క్లిక్ చేసి పంపిణీ చేయడానికి సంబంధించిన ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకోండి.
[post_ads]