Trending

6/trending/recent

PRC News: వచ్చే వారం పీఆర్సీపై ప్రకటన వచ్చే అవకాశం

  • ఇన్ని రోజులు ఆగారు.. పది రోజులు ఆగలేకపోయారా?
  • మార్కెట్ కమిటీల్లోని ఉద్యోగులకు 010 క్రింద వేతనాలు
  • ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి

ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ వస్తుందని, మూడు నాలుగు రోజుల్లో దీనిపై ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గవర్న మెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె. వెంకట్రామిరెడ్డి చెప్పారు. సీఎంవోలోని ముఖ్య అధికారులను గురువారం ఆయన కలిశారు. అనంతరం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. పీఆర్సీపై బుధవారం ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదిక ఇచ్చారని, దాన్ని పె సీఎం గురువారం చర్చించారని చెప్పారు. పీఆర్సీ ప్రక టనకు ముందు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించే సంప్రదాయం ఉందన్నారు. దానిని అనుసరించి ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరి పిందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కచ్చితంగా ప్రకటి స్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నో సందర్భాల్లో చెప్పారన్నారు. ఉద్యోగులపై ప్రభు త్వానికి ప్రేమే ఉంటుందని సజ్జల చెప్పారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి) ఇచ్చిన విషయం అంద రికీ తెలిసిందేనన్నారు. పీఆర్సీ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలపై వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. పీఆర్సీ కోసం ఇన్ని రోజులు ఆగినవారు పదిరోజులు ఆగలేకపోతున్నారా అని నిలదీశారు. వీరి తీరును ఉద్యో గులందరూ గమనిస్తున్నారని చెప్పారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad