Trending

6/trending/recent

GSWS Attendance Regularization చేయు విధానం

GSWS Attendance Regularization చేయు విధానం

ఇక ప్రతీ నెల సచివాలయ ఉద్యోగుల జీతాలు కేవలం బయోమెట్రిక్ హాజరు ప్రకారం మాత్రమే చెల్లించటం జరుగుతుంది. పని దినాల్లో హాజరు 100% బయోమెట్రిక్ హాజరు నమోదు చేసిన వారికి ఎటువంటి ఆన్లైన్ ప్రాసెస్ తో సంబంధం లేకుండా ఆయా నెల జీతాలును DDO వారు పెడతారు. కానీ ఎవరైనా Casual Leave, Optional Leave, On Medical Emergency, On Duty, Failure of Biometric, On Disputation,Others(Meeting, Training, Etc ) లాంటి కారణాల వలన బయోమెట్రిక్ హాజరు వెయ్యలేక పోతే వారు తప్పనిసరిగా HRMS Site లో వారి వివరాలు అప్డేట్ చెయ్యాలి.

ప్రతీ నెల 1వ తారీఖున వచ్చే జీతానికి 23వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఉన్న పని దినాలను పరిగణలోకి తీసుకుంటారు.ఉదాహరణకు నవంబర్ 2021 1 న వచ్చే జీతానికి సెప్టెంబర్ 2021 నెల 23 వ తారీఖు నుంచి అక్టోబర్ 2021 నెల 22 వ తారీఖు వరకు ఉన్నా పని దినాలను పరిగణలోకి తీసుకుంటారు. GSWS Daily Attendance డాష్ బోర్డు ప్రకారం హాజరును పరిగణలోకి తీసుకొని జీతాలను DDO వారు ఆన్లైన్ చేస్తారు.

హాజరు మినహాయింపు సందర్భాలు( ప్రస్తుతం ఉన్నవి):

1.Casual Leave

2. Optional leave 

3.Medical Emergency

4. On Duty,

5.Failure of Biometric, 

7. Deputation 

8. Meetings

9.Training

ప్రతీ సచివాలయ ఉద్యోగి పైన తెలిపిన సందర్భాలలో తప్పనిసరిగా వారికి ఇచ్చిన GSWS Web Site Username & Password లతో HRMS Site లో లాగిన్ అయ్యి వారి వివరాలు అప్డేట్ చెయ్యాలి. అప్డేట్ చేసిన తరువాత GSWS Daily attendance Dash Board లో చెక్ చేసుకోవాలి. అందులో అప్డేట్ అయ్యినట్టు అయితే వాటిని శాలరీ బిల్ పెట్టె టప్పుడు పరిగనిస్తారు.

Attendance Regularisation Process :

అటెండన్స్ మొబైల్ అప్లికేషన్ సరిగా పనిచెయ్యక పోయినా (Failure of Biometric) , వేరొక డ్యూటీ వేసిన ( Deputation ), అత్యవసర ఆరోగ్య పరిస్థితి ( On Medical Emergency ), ఆఫీస్ పని మీద బయటకు వెళ్లిన ( On Duty ), మీటింగ్ లకు హాజరు అయినా ( On Meeting ), ట్రైనింగ్ కు హాజరు అయినా ( On Training ) లాంటి సందర్భాల్లో హాజరు వెయ్యటం జరగదు. అప్పుడు హాజరును సాలరీ కు పరిగనించాలి అంటే తప్పనిసరిగా Regularisation చెయ్యాలి. చేసే విధానం : 

Step 1 : మొదట GSWS Daily Attendance Dash Board లో జిల్లా, మండలం, Categories : Employees ,From-To తేదీలు ఇచ్చి SUBMIT పై క్లిక్ చేస్తే అందులో వచ్చే వివరాలు చెక్ చేయాలి.పేరు, హోదా, క్యాలండర్ రోజులు, పని దినాలు, సెలవులు, హాజరు రోజులు, సెలవులు, Regularised రోజులు, హాజరు శాతం చూపిస్తుంది.

ఉదా. కు కింద సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 మధ్య హాజరు శాతం 95% గా మరియు No Days Regularized 0 గా ఉన్నాయి.

Step 2 : సర్దుబాటు చెయ్యటం కోసం మొదట HRMS వెబ్ సైట్ ఓపెన్ చెయ్యాలి. GSWS Site లాగిన్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి.

Step 3 : "Apply Leave / Regularise" అనే ఆప్షన్ లో "Attendance Regularization" అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.

Step 4 : "Attendance Regularisation" ఏ తేదీ నుంచి ఏ వరకు సర్దుబాటు చెయ్యాలో Form - To Date ను ఎంచుకోవాలి. ఒకే రోజు అయితే ఒకే రోజు ను సెలెక్ట్ చేయాలి.

Reason ను పైన చెప్పిన వాటిలో ఒకటి సెలెక్ట్ చేసి Remarks ( సర్దుబాటుకు సంబందించి) ను ఎంటర్ చేయాలి. సర్దుబాటుకు గల కారణాలతో కూడిన ఒరిజినల్ డాకుమెంట్స్ మరియు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలను PDF/JPG/WEBP రూపంలో అప్లోడ్ చెయాలి.తరువాత REGULARIZE పై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి.

Step 4 : పై అధికారుల ఆమోదం అయ్యాక GSWS Daily Attendance Dashboard లో అప్డేట్ అవ్వటం జరుగతుంది.

అక్టోబర్-2021 నెలకు సంబందించి ఆమోదం ఆటోమేటిక్ గా జరుగుతుంది.

అప్డేట్ అయ్యాక GSWS Daily Attendance Dashboard లో   రోజు Regularize రోజులు మారినట్టు,  హాజరు శాతం శాతం మారినట్టు గమనించగలరు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad