Trending

6/trending/recent

Citizen Outreach Programme: సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రాం - సచివాలయ ఉద్యోగుల విధి విధానాలు

రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందుతున్నటువంటి  ప్రభుత్వ పథకాలు మరియు సేవలపై ప్రజల అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలని సిటిజన్ ఔట్రీచ్ అనే ప్రోగ్రాం ను మొదలు పెట్టింది. అందులో భాగంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల తో వారి సచివాలయం పరిధిలో కి వెళ్లి సిటిజెన్ అవుట్ రీచ్ సర్వే చేయాలి.

సర్వే పేరు : సిటిజెన్ మరియు బెనిఫిషరీ ఔట్రీచ్ ప్రోగ్రాం

ఎవరు చేయాలి : ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి మరియు  2-3 వాలంటీర్లు ఒక టీంగా  చేయాలి.

ఎలా చేయాలి : సిటిజెన్ మరియు బెనిఫిషరీ ఔట్రీచ్ అనే మొబైల్ అప్లికేషన్ లో ఆధార్ నెంబర్ ద్వారా లేదా బయోమెట్రిక్ / ఐరిష్ ద్వారా లాగిన్ అయ్యి  చేయాలి.

ఎప్పుడు చెయ్యాలి :  నెలకు రెండు రోజులు అనగా నెల చివరి శుక్రవారం మరియు శనివారం నాడు సర్వే చేయాలి.

టార్గెట్ ఎంత  : ఒక టీమ్ కు ఒక రోజు కు  50 నుండి 100 ఇల్లు.

సర్వే సమయం లో అవసరం అయ్యేవి :

1. వెల్ఫేర్ క్యాలెండర్

2. సచివాలయ ఉద్యోగ యొక్క ఫోన్ నెంబర్లు

3. ప్రింటెడ్ మెటీరియల్ ( ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యదర్శులు ప్రింటు చేయవలెను )

ప్రోగ్రాం టైం లైన్ : సర్వే రోజు ఉద్యోగుల కు అనుగుణంగా 

సర్వే విధానం :

1. టీం లను ఏర్పాటు చేయటం : ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి మరియు  2-3 వాలంటీర్లు ఒక టీంగా ఏర్పాటు చేయాలి. ఒక రోజుకు ఒక టీం 50 నుండి 100 ఇళ్లను సందర్శించాలి.

2. అవగాహన : సచివాలయం ద్వారా అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు, సేవలను ప్రతి ఇంటికి విజిట్ చేస్తూ  తెలియజేయడం .

3. ఎంగేజ్మెంట్ : సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ప్రతి సిటిజన్ వాలంటీర్ గ్రూపులో జాయిన్ అయ్యే విధంగా చూసుకోవటం. ముఖ్యమైన హెల్ప్ లైన్ నెంబర్ లు మరియు సచివాలయ సిబ్బంది యొక్క కాంటాక్ట్ నెంబర్ లు ప్రజల దగ్గర ఉండేలా చూడటం.

సర్వే వివరాలు ఆన్లైన్ చేయు విధానం :

సిటిజెన్ ఔట్రీచ్  మొబైల్ అప్లికేషన్  : Click Here

ప్రతి సచివాలయ సిబ్బందిపై అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తరువాత సిబ్బంది బయోమెట్రిక్/ఐరిష్ విధానం లో లేదా OTP విధానం లో లాగిన్ అవ్వాలి. OTP విధానం లో ఆధార్ నెంబర్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తరువాత Household List అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.వాలంటీర్ క్లస్టర్ ను సెలెక్ట్ చేసుకుంటే ఆ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి కుటుంబాల వివరాలు ఒకరి పేరుమీద  చూపిస్తుంది.

హౌస్ హోల్డర్ పై క్లిక్ చేస్తే ప్రశ్నలు చూపిస్తాయి : 

ప్రశ్న 1: మీ గ్రామ/వార్డు సచివాలయం ఎక్కడ ఉన్నదో మీకు తెలుసా?

సమాధానం : తెలుసు / తెలియదు లో ఒకటి టిక్ చెయ్యాలి 

ప్రశ్న 2: మీ గ్రామ/వార్డు వాలంటీర్ మీకు తెలుసా?

సమాధానం : తెలుసు / తెలియదు లో ఒకటి టిక్ చెయ్యాలి

ప్రశ్న 3: మీ వాలంటీర్ ఎన్ని రోజులకీ ఒక్కసారి మీ ఇంటిని సందర్శిస్తున్నారు?

సమాధానం : రాలేదు / నెలకి ఒకసారి / నెల పైబడి లో ఒకటి టిక్ చెయ్యాలి

ప్రశ్న 4: మీకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి తెలుసా?( సంక్షేమ పథకాలు చదివి వినిపించండి)

సమాధానం : లిస్ట్ దిగువ ఇవ్వటం జరిగింది వాటిలో సిటిజెన్ కు తెలిసినవి టిక్ చెయ్యాలి. పొందినటువంటి పథకాలు కావు వారికి తెలిసిన వి టిక్ చేయాలి. 

ప్రశ్న 5: సచివాలయం అందిస్తున్న సేవలు/సర్వీసులు తెలుసా?

సమాధానం : తెలుసు / తెలియదు లో ఒకటి టిక్ చెయ్యాలి 

ప్రశ్న 6: మీ సచివాలయం ద్వారా అందుతున్న సేవలు సంబంధించి మీకు ఏమైనా సమస్య ఉందా?

సమాధానం : ఉంది / లేదు లో ఒకటి టిక్ చెయ్యాలి 

ఈ విధమైన ప్రశ్నలకూ సమాధానాలు ఎంటర్ చేసి అందుబాటులో ఉన్నటువంటి కుటుంబంలో ఒకరి ఫోటో కాప్చర్ చెయ్యాలి.తీసేటప్పుడు సిటిజన్ కనురెప్పలు Blink చేసినట్లయితే ఫోటో క్యాప్చర్ అవుతుంది. " Data Saved Successfully" అనీ వచ్చినట్లయితే పూర్తి అయినట్టు.

ఔట్రీచ్ ప్రోగ్రాం రోజు అనగా ప్రతీ నెల చివరి శుక్రవారం మరియు శనివారం నాడు క్లస్టర్ వివరాలు చూపిస్తాయి. అందులో సచివాలయ సిబ్బంది ఎవరి క్లస్టర్ పరిధిలో సర్వే చేస్తున్నారో ఆ క్లస్టర్ ను సెలెక్ట్ చేసుకోవాలి, చేసుకున్న తరువాత ఆ క్లస్టర్ పరిధిలో ఉండే హౌస్ హోల్డ్ వివరాలు మొత్తం చూపిస్తాయి, అందులో అందుబాటులో ఉన్నటువంటి వారి పేరు సెలెక్ట్ చేసుకోని పైన చెప్పిన విధం గా సర్వే పూర్తి చెయ్యాలి.

మీకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి తెలుసా? ( సంక్షేమ పథకాలు చదివి వినిపించండి ) అనే ప్రశ్నకు  చదివి వినిపించాల్సిన 28 సంక్షేమ పథకాలు : 

1.Agrigold

2.Ammavodi

3.House Sites (Compensation Paid for land acquisition & land development)

4.Jagananna Chedodu (Rajakas, Tailors & Nayee Brahmins)

5.Jagananna Gorumudda

6.Jagananna Thodu

7.Jagananna Vasati Deevena

8.Jagananna Vidya Deeven

9.Jagananna Vidya Kanuka

10.Law Nestham

11.Matsya kara bharosa

12.MSME Restart

13.One time Financial Assistance to Archakas/ Imams/ Mouzams / Pastors

14.Videsi Vidya Deevena

15.YSR 'O' Vaddi (SHGs)

16.YSR Aasara

17.YSR Arogya Asara

18.YSR Arogya Sri

19.YSR Bhima

20.YSR Cheyutha

21.YSR Jalakala

22.YSR Kapu Nestam

23.YSR Netanna Nestam

24.YSR Pension Kanuka

25.YSR Rythu Bharosa

26.YSR Sampurna Poshana

27.YSR Sunna Vaddi (farmers)

28.YSR Vahana Mitra

సర్వే విదానం ( డెమో వీడియొ )  :

సిటిజెన్ ఔట్రీచ్ డాష్ బోర్డు లింక్ :  Click Here  

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad