Trending

6/trending/recent

Older Vehicles: మీరు పాత వాహనాలు నడుపుతున్నారా..? అయితే జాగ్రత్త.. రూ.10 వేలు జరిమానా కట్టాల్సిందే..!

Older Vehicles: పర్యావరణ కాలుష్యం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా ప్రత్యేక దృష్టి సారించాయి. మోదీ ప్రభుత్వం ఇటీవల స్క్రాపేజ్‌ పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు వాటి వాటి పాలసీలను అనుసరిస్తున్నాయి. అందు వల్ల పాత వాహనాలు వాడే వారు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తించుకోవడం మంచిది. లేకపోతే జేబుకు చిల్లులు పడే అవకాశం ఉంది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా వెహికల్‌ స్క్రాపేజ్‌ పాలసీని ఆవిష్కరించింది. 15 ఏళ్ల నాటి పెట్రోల్‌ వాహనాలు, 10 ఏళ్ల నాటి డీజిల్‌ వాహనాలపై నిషేధం విధించింది. ఈ కార్లను రోడ్లపై నడిపితే రూ.10 వేల జరిమానా విధిస్తోంది. ఎవరైనాసరే పాత వాహనాలు నడిపినట్లయితే భారీగా జరిమానా కట్టాల్సి వస్తుందని పేర్కొంది.

అంతేకాకుండా ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు రోడ్డుపై పాత వాహనాలు కనిపిస్తే స్ర్కాపేజ్‌ సెంటర్‌కు తరలించే అధికారం ఉంటుందని గుర్తించుకోవాలి. కాలుష్య నియంత్రణ లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం స్క్రాపేజ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. ఇకపోతే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి పాలసీలను అమలులోకి తీసుకువచ్చే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. 



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad