Trending

6/trending/recent

New Education Policy: ఫౌండేషన్ స్కూల్స్ ప్రాజెక్టుకు?

  • పాఠశాల విద్యాశాఖ ఆలోచన
  • కాంట్రాక్టు పద్ధతిలోనే పోస్టులు
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు

New Education Policy:  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 5+3+3+4 విధానం ఉపాధ్యాయ పోస్టులకు ఎసరు తెచ్చేలా ఉంది. నూతన వ్యవస్థలో (ప్రైమరీ, 1, 2 తరగతులను ఫౌండేషన్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ ఫౌండేషన్ స్కూల్స్న ప్రాజెక్టు గానీ, సొసైటీ గానీ అప్పగించాలని విద్యాశాఖ ఆలోచన చేస్తోంది. ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అంశంపై ప్రస్తావించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక విద్యలో శాశ్వత ప్రతిపాదికనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. ప్రాజెక్టు గానీ, సొసైటీ గానీ ఈ స్కూల్స్న అప్పగిస్తే ఈ నిబంధనకు నీళ్లుదిన్నట్లే అవుతుంది. ఫౌండేషన్ స్కూల్స్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారిని తీసుకుంటారా? వేతనాలు అందుకు తగ్గట్టుగా ఇస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారనుంది. రాష్ట్రంలో 34 వేల ప్రాథమిక పాఠశాలల్లో 86 వేల ఎస్ జిటి ఉపాధ్యాయ మంజూరు పోస్టులుంటే 70 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. 16 వేలపోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో ఫౌండేషన్ స్కూల్కు ఒక ఎసిటి ఉండాలని నూతన వ్యవస్థలో పేర్కొన్న విధంగా 34 వేల మంది కేటాయించబడతారు. తక్కిన పోస్టుల్లో కొన్నింటిని అంగన్వాడీలతో నింపినా ఎక్కువ పోస్టులను వాలంటీర్లతో నింపే అవకాశం ఉంది. మిగిలిన 36 వేల మంది హైస్కూళ్లకు కేటాయించబడతారు. అప్పుడు ప్రభుత్వ స్కూల్లో ఈ 16 వేల రెగ్యులర్ టీచర్ పోస్టులకు మంగళహారతి పాడినట్టే అవుతుందని భావిస్తున్నారు. సమీప భవిష్యత్తులో ఇక రెగ్యులర్ డిఎసి సి ఉండకపోవచ్చునని నిరుద్యోగ ఉపాధ్యాయులు కలవరపడుతున్నారు. అదేవిధంగా హైస్కూల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఏ మీడియంలో చదువుకుంటే దానినే కొనసాగిస్తామని విద్యాశాఖ చెబుతోంది. ఒక్క మీడియంలో మాత్రమే పాఠశాలలు నిర్వహిస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 20 వేలు కోల్పోయే ప్రమాదం ఉందని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2018లో డిఎస్సీ ద్వారా సుమారు 6 వేల ఉపాధ్యాయ పోస్టులను మాత్రమే విద్యాశాఖ భర్తీ చేసింది. మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. అవసరమైన మేరకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా కొత్త ప్రయోగాలు చేయడం రెగ్యులర్ ఉపాధ్యాయ పోస్టులకు ఎగనామం పెట్టడం కోసమేనని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad