Trending

6/trending/recent

India Covid: థర్డ్ వేవ్‌కి రెడీ అవుతున్న రాష్ట్రాలు... సవాలుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం

 Covid 19 Updates: దేశ ప్రజల్లో సెకండ్ వేవ్ ముగుస్తున్నట్లే అనే కాన్ఫిడెన్స్ కలుగుతోంది. 3 వారాల్లో కొత్త కేసులు 50 శాతం తగ్గడంతో... ఇక క్రమంగా కేసులు తగ్గిపోతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇండియాలో వ్యాక్సిన్ల ధరలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. కేంద్రానికి తక్కువ ధర, రాష్ట్రాలకు ఎక్కువ ధరకు ఇవ్వడమేంటని ఫైర్ అయ్యింది. దీనిపై జాతీయ ధరల విధానం అంటూ ఉండదా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. రాష్ట్రాలు ఎక్కువ రేటు ఎందుకు చెల్లించాలని అడిగింది. నేషనల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అంశాన్ని సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు... కేంద్రాన్ని ఇలా చాలా ప్రశ్నలు అడిగింది. 45 ఏళ్లు దాటిన వారికి సరిపడా వ్యాక్సిన్లు ఎందుకు రెడీగా ఉంచుకోలేకపోయారు అని కూడా అడిగింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలోని అందరికీ వ్యాక్సిన్ వేస్తామని కేంద్రం... సుప్రీంకోర్టుకు తెలిపింది. ఐతే... ఇప్పటివరకూ 4న్నర నెలల్లో కేంద్రం 21 కోట్ల మందికే వ్యాక్సిన్ వేసింది. నెక్ట్స్ 7 నెలల్లో దాదాపు 70 కోట్ల మందికైనా వ్యాక్సిన్ వెయ్యాలని నిపుణులు అంటున్నారు. అందువల్ల ఇదో భారీ సవాలుగా ఉంది.

తెలంగాణలో ఆర్టీసీ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు జూన్ 3 నుంచి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. GHMC పరిధితోపాటూ... అన్ని జిల్లా కేంద్రాల్లో రోజుకు 10 వేల మందికి వ్యాక్సిన్ ఇస్తారు. ఇవాళ్టి నుంచి తెలంగాణలో బ్యాంకుల పనివేళలు మారాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకూ పనిచేస్తాయి. మెట్రోరైళ్లు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకూ తిరుగుతాయి. అటు ఇవాళ్టి నుంచి తెలంగాణలో యూనివర్శిటీలు క్రమంగా తెరచుకుంటాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకూ తెరచి ఉంటాయి. సిబ్బంది 50 శాతమే ఉంటారు. కానీ స్కూళ్లు, కాలేజీలకు జూన్ 15 వరకూ సెలవులు ఉన్నాయి. డిగ్రీ విద్యార్థులకు ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్ క్లాసులు జరుగుతాయి. ఇంటర్ అడ్మిషన్లకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

జూన్ 5 నుంచి అర్హులైన పేదలు, కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన వారందరికీ... ఉచిత రేషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలా జూన్, జులైలో ఇవ్వనుంది. జూన్ లో 10 కేజీల రైస్, జులైలో 5 కేజీల రైస్ ఇవ్వనుంది. జూన్‌లో కేంద్రం గుర్తించిన 53.56 లక్షల కార్డు దారులకు, రాష్ట్రం గుర్తించిన 33.86 లక్షల కార్డుదారులకు ఇవి ఇస్తారు. కార్డులో ఎంత మంది వ్యక్తులు ఉంటే... అంతమందికీ... 2 నెలల్లో 15 కేజీల చొప్పున ఇస్తారు. అంత్యోదయ అన్న యోజన కార్డు దారులకు ఇచ్చే 35 కేజీలకు అదనంగా మరో 10 కేజీలు, అన్నపూర్ణ కార్డు దారులకు ఇచ్చే 10 కేజీలకు అదనంగా మరో 10 కేజీలు ఇస్తారు.

Covid 19 Updates: ఇండియాలో శనివారం 1,73,790 కొత్త కరోనా కేసులు రాగా.... ఆదివారం 1,65,553 వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,78,94,800కి చేరింది. కొత్తగా శనివారం 3,617 మంది చనిపోగా... ఆదివారం 3,460 మంది చనిపోయారు. మరణాల సంఖ్య కాస్త తగ్గినట్లే. మొత్తం మరణాల సంఖ్య 3,25,972కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.2 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.08 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 2,76,309 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,54,54,320కి చేరింది. రికవరీ రేటు శనివారం 90.8 శాతంగా ఉంది. రికవరీ రేటు ఆదివారం 91.3 శాతంగా ఉంది. ఇది పెరగడం మంచి విషయం. ప్రస్తుతం భారత్‌లో 21,14,508 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసులు రోజూ లక్ష దాకా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 20,63,839 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 34 కోట్ల 31 లక్షల 83 వేల 748 టెస్టులు చేశారు. కొత్తగా 30,35,749 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 21కోట్ల 20లక్షల 66వేల 614మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Telangana Covid: తెలంగాణలో కొత్తగా 2,524 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 5,78,351కి చేరాయి. కొత్తగా 3,464 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 5,40,986కి చేరింది. రికవరీ రేటు 93.53 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 18 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,464కి చేరాయి. మరణాల రేటు 0.56 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 34,084 యాక్టివ్ కేసులున్నాయి.

GHMC పరిధిలో కొత్తగా 307 కేసులొచ్చాయి. తెలంగాణలో కొత్తగా 87,110 కరోనా టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య కోటి 51లక్షల 76వేల 159కి చేరింది.

AP Covid: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 83,461 టెస్టులు చెయ్యగా... కొత్తగా 7,943 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 16,93,085కి చేరింది. కొత్తగా 98 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 10,930కి చేరింది. కొత్తగా 19,845 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 15,28,360కి చేరింది. ప్రస్తుతం 1,53,795 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,92,56,304 టెస్టులు జరిగాయి.

World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 3,53,612 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 17.13 కోట్లు దాటింది. కొత్తగా 7,723 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 35.64 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.53 కోట్లు ఉన్నాయి. అమెరికాలో కొత్తగా 5,141 కేసులు, 141 మరణాలు వచ్చాయి. బ్రెజిల్‌లో 32,554 కొత్త కేసులు... 874 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు ఇండియాలో వస్తుంటే... ఆ తర్వాత బ్రెజిల్, అర్జెంటినా, కొలంబియా, ఇరాన్ ఉన్నాయి. రోజువారీ మరణాల్లో ఇండియా టాప్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత బ్రెజిల్, అర్జెంటినా, కొలంబియా, రష్యా ఉన్నాయి.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad