Trending

6/trending/recent

Monthly Horoscope: మాస ఫలాలు... జూన్ నెల ఏ రాశి వారికి ఎలా ఉందంటే...

 Monthly Astrology: అప్పుడే జూన్ వచ్చేసింది. ఈ నెల గడిస్తే అర్థ సంవత్సరం ముగిసినట్లే. మరి జూన్‌లో ఏ రాశి వారికి ఎలాంటి ఫలాలు ఉన్నాయి... జ్యోతిష పండితులు ఏం సూచిస్తున్నారో తెలుసుకుందాం.

Monthly Horoscope: వార్షిక రాశి ఫలాలతోపాటూ.... న్యూస్ 18 నెలవారీ రాశి ఫలాలు, వార ఫలాలు, దిన ఫలాలు కూడా ఇస్తోంది. వీటిని అత్యంత అనుభవం ఉన్న జ్యోతిష పండితులు రూపొందిస్తున్నారు. పైపైన చెప్పేయడం కాకుండా... లోతైన అధ్యయనంతో ఈ రాశి ఫలాలను వారు రూపొందిస్తున్నారు. నక్షత్ర గమనాలు, సూర్య గమనం, గ్రహాల కదలికలు, రాశిలో వాసి, కాలం, చంద్రుడి ప్రభావం ఇలా అన్ని అంశాలనీ లెక్కలోకి తీసుకుంటున్నారు. అందువల్ల ఈ రాశి ఫలాలు... వాస్తవాలకు దగ్గరగా ఉంటున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి జూన్ నెలలో ఏ రాశి వారికి ఎలాంటి అదృష్టం ఉందో తెలుసుకుందాం.

మేష రాశి (Aries) ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నెలంతా చాలావరకూ ప్రశాంతంగానే గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ఫ్లాట్ కొనుగోలు చేస్తారు. దూరప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలున్నాయి. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి అభివృద్ధి కనిపిస్తోంది. ఎవరికీ డబ్బు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. నష్టపోతారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా బాగుంటుంది. దూరపు బంధువులకు సంబంధించి దుర్వార్త వింటారు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

వృషభ రాశి (Taurus) ఈ నెలంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్కచేయరు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతర స్త్రీలతో పరిచయం పెంచుకోవద్దు. సమీప బంధువుల్లో ఒకరికి సంబంధించి దుర్వార్త వింటారు. వ్యాపారులకు చాలా బాగుంటుంది. లాయర్లకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. టెక్నాలజీ నిపుణులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. కోపతాపాలకు ఇది సమయం కాదు. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండాలి. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది.

మిథున రాశి (Gemini) ఉద్యోగం విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. అష్టమ శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, తలచిన పనుల్లో కొన్ని నెరవేరతాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు ఎంతగానో లాభపడతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ, పూర్తిగా పడకపెట్టేంత పరిస్థితి రాకపోవచ్చు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంతో ఎంజాయ్ చేస్తారు.

కర్కాటక రాశి (Cancer) ఈ నెలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా సానుకూల పరిస్థితులుగా మారతాయి. అదృష్ట యోగం పడుతుంది. అనుకున్న పనులు చాలావరకు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగు ఉండదు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. బాగా దగ్గరివారు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చే సూచనలున్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐ.టి నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. ప్రయాణాలు కష్టనష్టాలకు దారితీస్తాయి. కోర్టు కేసులో రాజీ కుదిరే సూచనలున్నాయి.

సింహ రాశి (Leo) అన్ని విధాలా అనుకూలమయిన సమయం. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. సుఖ సంతోషాల్లో మునిగి తేలుతారు. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఇంట్లో శుభ కార్యానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరతాయి. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో విహారానికి వెళ్తారు. వ్యాపారులు సునాయాసంగా అభివృద్ధి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. భార్య వైపు బంధువులు ఇంటికి వస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్య సత్ఫలితాలు సాధిస్తారు. ఐ.టి నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

కన్య రాశి (Virgo) గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల ఈ నెల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరింట గురుడున్న కారణంగా మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. అప్పులు చేయాల్సి వస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీలతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. సఏద్యోగులో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సతీమణితో కలిసి షాపింగ్ చేసి, కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు పోవడం శ్రేయస్కరం కాదు. ఉంది. కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. కుటుంబపరంగా ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులు మరి కొంత కాలం ఆగాల్సి ఉంటుంది.

తుల రాశి (Libra) ఈ నెల అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా స్వాతి నక్షత్రం వాళ్లకు చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులలో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. స్నేహితులకు విందు ఇస్తారు. తోబుట్టువులు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. దూర ప్రయాణాలు గానీ, తీర్థయాత్రలు గానీ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండో ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఎవరికీ డబ్బులివ్వవద్దు. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలున్నాయి. ప్రస్తుతానికి ఆరోగ్యానికి ధోకా లేదు. నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి, చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. కోర్టు వ్యవహారాలలో గెలిచే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి (Scorpio) ఈ నెల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. అధికారులు మీ ప్రతిభను, శ్రమను గుర్తిస్తారు. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడడం మానుకోండి. ప్రతిదాన్నీ అపార్థం చేసుకోవడం మంచిది కాదు. ఎవరితోనూ వివాదాలకు, వాదాలకు దిగవద్దు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. మంచి వ్యక్తులు పరిచయమవుతారు. అదనపు బాధ్యతలు మీద పడతాయి. రియల్ ఎస్టేట్ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. రహస్యాలను మనసులోనే ఉంచుకోండి. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. వారాంతంలో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యాపారులు బాగా రాణిస్తారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి.

ధనస్సు రాశి (Sagittarius) ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఈ నెల ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఏలిన్నాటి శని కారణంగా కొన్ని ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తుంటాయి. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలున్నాయి. మీ తల్లితండ్రుల నుంచి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. తీర్థ యాత్రలకు ప్లాన్ వేస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితం కనిపించదు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి. పిల్లలకు సంబంధించి ఒక సమస్య ఆందోళన కలిగిస్తుంది.

మకర రాశి (Capricorn) నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారు కొద్దిగా ఒత్తిడికి గురవుతుంటారు. ఏలిన్నాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం, తిప్పుట వంటివి అనుభవానికి వస్తాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అయితే, కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సతీమణితో వివాదాలకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. భారీయెత్తున షాపింగ్ చేస్తారు. పిల్లలు మిమ్మల్ని సంతోష పెడతారు. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆర్థిక నిపుణులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండకపోవచ్చు.

కుంభ రాశి (Aquarius) ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. రోజులు బాగానే గడిచిపోతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. భార్యా పిల్లలతో కలిసి కొనుగోళ్లు చేస్తారు. ఏలిన్నాటి శని కారణంగా తిప్పట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు చాలావరకు పూర్తవుతాయి. సమీప బంధువు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసగించే ప్రమాదం ఉంది. విదేశీ ప్రయాణ సూచనలున్నాయి. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. అప్పులు తీరుస్తారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఎంతగానో ఆందోళన కలిగిస్తుంది. చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఎంత ప్రయత్నించినా ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లవు. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది.

మీన రాశి (Pisces) ఈ నెల అన్ని విధాలా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు ఉద్యోగంలో ప్రవేశించే అవకాశం ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. అయితే, ఖర్చులకు కళ్లెం వేయాల్సి ఉంటుంది. ఇల్లు గానీ, స్థలం గానీ కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. మరో ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువులు మిమ్మల్ని పలకరించే అవకాశం ఉంది. వ్యాపారులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలున్నాయి. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక, ప్రవచన రంగాల్లో ఉన్నవారు, ఆలయ సిబ్బంది, యోగా, సంగీతం వంటి రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad