Trending

6/trending/recent

Examinations: పరీక్షలపై పంతమా?

Examinations: కరోనా విజృంభణ, థర్డ్‌ వేవ్‌ భయాలతో సీబీఎ్‌సఈ, ఐసీఎ్‌సఈలు 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయి. జాతీయస్థాయి పోటీ పరీక్షలపై ఇప్పటికే సీబీఎ్‌సఈ విద్యార్థులు దృష్టిపెట్టి చదువుతున్నారు. 

  • సీబీఎ్‌సఈ పరీక్షలు రద్దు చేసిన కేంద్రం
  • జాతీయ పోటీ పరీక్షలపై ఆ విద్యార్థుల దృష్టి
  • రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ వాయిదా పద్ధతే
  • టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల రద్దుకు ససేమిరా
  • దీంతో ‘జాతీయం’గా మన పిల్లలకు దెబ్బ
  • వాయిదాలతో విద్యా సంవత్సరం ఆలస్యం
  • పరీక్షలనాటికిసిలబ్‌స పూర్తికాక తీవ్ర ఒత్తిడి
  • అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి
  • విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రుల్లో టెన్షన్‌

ఏపీలో మాత్రం పరీక్షలపై పంతం పట్టిన సర్కారు తీరు వల్ల.. అతి తీవ్రంగా ఉండే ఈపోటీలో మన ఇంటర్‌ విద్యార్థులు వెనుకబడే ప్రమాదంఉంది. ఇలాగే పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోకుండా.. వాయిదాలు వేస్తూపోతే విద్యాసంవత్సరం ఆలస్యమై, అటు పరీక్షల ఒత్తిడి..ఇటు సిలబస్‌ పూర్తికాలేదనే ఆందోళన మధ్య టెన్త్‌ పిల్లలు నలిగిపోతారని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు.

కరోనా మహమ్మారి ప్రభావం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తూనేఉంది. నిన్నామొన్నటిదాకా సగటున వందమంది కొవిడ్‌ బాధితులు చనిపోతూ వచ్చారు. సుమారు 600 మంది వరకు ఉపాధ్యాయులు గత ఏడాదికాలంలో మృత్యువాత పడ్డారు. విధి నిర్వహణ చేస్తూనో, సర్కారీ పథకాలు, కార్యక్రమాల ప్రచారంలో పాల్గొంటూనో, ఎన్నికల ప్రక్రియలో భాగమవుతూనే వీరంతా కొవిడ్‌బారిన పడి చనిపోయారు. ఇక పెద్ద సంఖ్యలోనే విద్యార్థులకు సైతం కరోనా సోకుతోంది. పైగా థర్డ్‌ వేవ్‌ ముప్పు వారిని మరింత కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలను మహమ్మారి నుంచి ఎలా కాపాడుకోవాలా అని తల్లిదండ్రు లు కలవరపడుతున్నారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం గ తంలో వాయిదావేసిన పరీక్షలను నిర్వహించడానికే మొగ్గు చూపుతోంది. పైగా తల్లిదండ్రులు పరీక్షలను రద్దుచేయాలని కోరుకోవడం లేదని సాక్షాత్తూ విద్యామంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెబుతున్నారు. అదేమం టే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పరీక్షల రద్దును తరచూ కోరుతున్నందునే ప్రభుత్వం ఇలా మొండి వైఖరి అవలంభిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

వాయిదాలతో విద్యార్థులకు దెబ్బ...

కరోనా కారణంగా 2020-21 విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. సకాలంలో నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడుకూడా పరీక్షలు వాయిదా వేస్తూపోతే 2021-22 విద్యా సంవత్సరం కూడా ఆలస్యం అవుతుంది. క్లాసులు మొదలై, సిలబస్‌ సగంలో ఉండగానే పరీక్షలు ముందుకొస్తాయి. ఒకవైపు పరీక్షల ఒత్తిడి.. మరోసారి పూర్తికాని సిలబస్‌... టెన్త్‌ విద్యార్థులు రెండు విధాలా నలిగిపోతారు. ఇంటర్‌ పరీక్షలను మన దగ్గర వాయిదాలు వేస్తున్నారు. కానీ, జాతీయస్థాయిలో సీబీఎ్‌సఈ ఇప్పటికే 12వతరగతి పరీక్షలను రద్దు చేసేసింది. దీంతో సీబీఎ్‌సఈ విద్యార్థులు ప్రస్తుతం జేఈఈ, నీట్‌పై తమ దృష్టినంతా పూర్తిగా లగ్నంచేసి ప్రిపేర్‌ అవుతున్నారు. మన రాష్ట్రంలో మాత్రం పరీక్షలపై ఇంకా స్పష్టతే రాలేదు. దీంతో  ఇంటర్‌ విద్యార్థులు ఇటు తమ క్లాసు పుస్తకాలు చదవాలో లేక అటు జాతీయస్థాయి పరీక్షలకు సిద్ధమవ్వాలో తెలియని సంకటంలో ఉన్నారు. ఫలితంగా జాతీయస్థాయి పోటీలో మనవాళ్లు వెనుకబడిపోతారని విద్యానిపుణులు ఆందోళన చెందుతున్నారు. 

ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయగా .. ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు అప్పుడే 2021-22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా ప్రారంభించాయి. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితి కూడా ప్రభు త్వం గుర్తించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవికదృష్టితో ఆలోచించి.. మంచి నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యానిపుణులు  కోరుతున్నారు.

రద్దుతో కొత్త అడ్మిషన్లేమీ ఆగవు...

పదో తరగతి పరీక్షలు నిర్వహించకుంటే ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్లకు ఇబ్బంది అవుతుందనేది ప్రభుత్వం వాదన. కానీ గత ఏడాది కూడా కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసినప్పుడు ఈ సమస్య ఉత్పన్నం కాలేదు. ఏటా నిర్వహించినట్టే ఆర్‌జీయూకేటీ ఎంట్రెన్స్‌ నిర్వహించి అడ్మిషన్లు చేపట్టింది. అలాగే, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకుండా ఎంసెట్‌ అడ్మిషన్లు నిర్వహించలేమన్న వాదనలోనూ అర్థం లేదని విద్యానిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇంటర్‌ మార్కులకు వెయిటేజి రద్దుచేసి ఎంసెట్‌ ర్యాంకింగ్‌ ఆధారంగా అడ్మిషన్లు చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఈసారికి ఇదే పద్ధతిని అనుసరించడం గమనార్హం. పోనీ ఈ పరీక్షల వల్లనే ఉద్యోగులు వస్తాయా అంటే అదీలేదు. సింహభాగం ఉద్యోగాలకు ప్రత్యేకంగా నిర్వహించుకునే పోటీపరీక్షలలో సాధించే మెరిట్టే ప్రాతిపదిక.Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad