Trending

6/trending/recent

Online Examinations: ఆన్‌లైన్‌లోనే ప్రాక్టికల్‌, ఇంటర్నల్‌ పరీక్షలు

  • జూన్‌ 28లోగా మార్కులు అప్‌లోడ్‌ చేయాలి
  • స్కూళ్లకు సీబీఎ్‌సఈ ఆదేశం

Online Examinations:  సీబీఎ్‌సఈ 12వ తరగతి విద్యార్థుల అసె్‌సమెంట్‌కు సంబంధించి బోర్డు కీలక నిర్ణయం తీసుకొంది. ప్రాక్టికల్‌, ఇంటర్నల్‌ పరీక్షలు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్టయితే, వాటిని పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహించాలని స్కూళ్లను సీబీఎ్‌సఈ ఆదేశించింది. జూన్‌ 28లోగా ఈ పరీక్షలకు సంబంధించిన మార్కులను అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంది. గతంలో జూన్‌ 11వ తేదీని గడువుగా పేర్కొంది. దీన్ని పొడిగిస్తూ తాజాగా ప్రకటన జారీచేసింది.

థియరీ, ప్రాక్టికల్స్‌, ప్రాజెక్ట్‌, ఇంటర్నల్‌ పరీక్షల నిర్వహణకు సంబంఽధించిన మార్గదర్శకాలను అధికారిక వెబ్‌సైట్‌లో సీబీఎ్‌సఈ పొందుపరచింది. పరీక్షల నిర్వహణ కోసం సీబీఎ్‌సఈ ఎక్స్‌టర్నల్‌ టీచర్లను నియమించిన చోట... ఆయా టీచర్లే పరీక్షల తేదీలను నిర్ణయిస్తారని తెలిపింది.

ఎక్స్‌టర్నల్‌ టీచర్లు అందుబాటులో లేకపోతే సంబంధిత స్కూల్‌ టీచర్లు విద్యార్థుల మార్కులను అప్‌లోడ్‌ చేయవచ్చని తెలిపింది. దీనికి సంబంధించి మళ్లీ గడువు పొడిగించడం వీలుకాదని, టీచర్లందరూ కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సీబీఎ్‌సఈ స్పష్టం చేసింది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad