Trending

6/trending/recent

Examinations: పరీక్షల నిర్వహణపై అంతర్మధనం

  • జులై తొలి వారంలోపు తుది నిర్ణయం

Examinations: పదో తరగతి, ఇంటర్మీడియట్ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అంతర్మధనంలో పడింది. వీటిని నిర్వహించాలా? వద్దా అనే డైలామాలో ఉన్నతాధికారులతో పాటు విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కేసుల ఉధృత్తి తగ్గుతున్నా.. మూడో దశ ఉంటుందనే ఆందోళన ప్రభుత్వంలో నెలకొంది. ఈ దశ ఎక్కువగా పిల్లలపై ప్రభావం ఉంటుందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెండో దశలో సుమారు 600 మంది ఉపాధ్యాయులు కరోనాతో మృతిచెందారు. ఉపాధ్యాయులంద రికీ ఇప్పటికీ వ్యాక్సినేషన్ పూర్తికాలేదు. 60 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతున్నా, ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఈ నేపధ్యంలో పరీక్షలను నిర్వహించాలా వద్దా అనే గందరగోళంలో ప్రభుత్వం ఉంది.

రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 6.40 లక్షల మంది, ఇంటర్మీడియట్ విద్యార్థులు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. ఏ నిర్ణయమైనా దాని ప్రభావం ఇంత మందిపై పడుతుంది. పరీక్షల నిర్వహణపై జులై మొదటి వారంలోపు నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పరిస్థితి అనుకూలిస్తేనే జులై లోపు పరీక్షలు నిర్వహిస్తామని, లేదంటే నిర్వహించలేమని చెప్పారు. అయితే పరీక్షల నిర్వహణ తమకు మొండిపట్టు లేదన్నారు. జులై తరువాత పరీక్షలు నిర్వహిస్తే కేంద్రప్రభుత్వం నిర్వహించే జెఇఇ. నీట్ వంటి పరీక్షలకు అడ్డంకిగా మారుతాయని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎంసెట్, త్రిపుల్ ఐటీ ప్రవేశపరీక్షలను కూడా నిర్వహించాల్సి ఉంది. వీటికి కూడా అడ్డంకిగా మారుతాయని విద్యాశాఖ ఆలోచన చేస్తుంది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad