Trending

6/trending/recent

CPS to OPS: 2004 ముందు వారికి పాతపెన్సన్‌ నర్తింపుకు ఫైనాన్స్‌ సెక్రటరీ హామీ

CPS to OPS: 2004 సచివాలయంలో ఈరోజు ఫైనాన్స్‌ ప్రత్యేక కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ గారిని ఉపాధ్యాయులు, అధ్యాపకులు సమస్యలపై పిడిఎఫ్‌  ఎమ్మెల్సీలు కె.ఎస్‌.లక్ష్మణరావు, ఐ,వెంకటేశ్చరావు, షేక్‌ సాబ్జీ కలసి ప్రాతినిధ్యం చేసారు.

2004కు ముందు డియస్సీ నోటిఫికేషన్ల ద్వారా నియమింపబడిన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పాతపెన్షన్‌ వర్తింప చేసే ఫైలు త్వరగా ఆమోదించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్స్‌, జూనియర్‌ కాలేజీలలో మినిమమ్‌ టైమ్‌స్కేల్‌ నందు పనిచేయుచున్న జనరల్‌ మరియు ఒకేషనల్‌. అధ్యాపకులు రెన్యువల్‌ ఫైల్‌ త్వరలో ఆమోదిస్తామని అన్నారు.

ప్రావిడెంట్‌ ఫండ్‌లోన్లు, తుది చెల్లింపులకు నిధులు విడుదలకు ఎ.పి.జియల్‌.ఐ లోను, తుది చెల్లింపులకు బడ్జెట్‌ విడుదల చేయాలని ప్రాతినిధ్యం చేసినట్లు వారు తెలియజేశారు.

సమగ్ర శిక్షాభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీమతి వెట్రిసెల్వీ గారిని కలసి ప్రాజెక్టు నందు కాంట్రాక్టు, జౌట్‌ సోర్సింగ్‌, పార్ట్‌ టైమ్‌ పద్దతిలో పనిచేయుచున్న అందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులకు, కెజిబివిలలో పనిచేస్తున్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ వారికి జీవో 40 ప్రకారం మినిమం టైమ్‌ స్కేల్‌ వర్తింపజేయాలని, రిక్వెస్ట్‌, మ్యూచువల్‌ బదిలీలకు అనుమతి ఇవ్వాలని, మరణించిన ఉద్యోగులకు రెండు లక్షల ఎక్స్‌ గ్రేషియా విడుదల చేయాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది. బదిలీలు చేస్తామని, ఎక్స్‌  గ్రేషియా ఇస్తామని మినిమం టైంస్కేల్‌ అమలుకు సంబంధించి ఫైనాన్స్‌ అధికారులుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad