Saturday, July 27, 2024
AP TET Syllabus: ఏపీ టెట్ సిలబస్...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

AP TET Syllabus: ఏపీ టెట్ సిలబస్ విడుదల

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • పాదయాత్రలో ఇచ్చిన హామీను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి…
  • కోర్టుకేసులు పరిష్కరించి 2193 మంది డియస్‌సి అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు…
  • మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌తో యస్‌జిటి లుగా నియామకం…
  • 2021 ఏపి టెట్ సిలబస్‌ విడుదల…
  • రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌…

2014 ఎ న్నికల సందర్భంగా సుదీర్ణ పాదయ్యాతలో ముఖ్యమంత్రి వైయస్‌. జగన్మోహనరెడ్డి డియస్‌సి అభ్యర్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం జరిగిందని, 2008 డియస్‌సికి సంబంధించిన కోర్టు కేసులను పరిష్కరించి 2193 మంది అభ్యర్థులు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

డియస్‌సి-2008కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల నియామకాలపై శుక్రవారం మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలోని ఆర్‌అండ్‌ భవనం నందు మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ  ప్రత్యేకమైన పరిస్థితుల్లో మానవతా ధృక్పధంతో డియస్‌సి-2008 కు సంబంధించి 2193 మంది. అభ్యర్థులకు మినిమమ్‌ టైమ్‌ స్కేలుతో యస్‌బిటి లుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

2008-డియస్‌సికి సంబంధించి నియామకాల క్రైటీరియా నిబంధనల మార్చు వలన సుమారు వేలకు పై చిలుకు అభ్యర్థులు ఉద్యోగావకాశాలను కోల్పోవడం జరిగిందన్నారు. ఉద్యోగ అవకాశం కోల్పోయి కోర్టుల చుట్టూ ఈఅంశం నానుడికి గురి అయ్యిందన్నారు. 2014 ఎ న్నికల హామీల్లో అప్పటి తెలుగుదేశం పార్టీ 2008 డియస్‌సి అభ్యర్థుల భవిత తేలుస్తామని చెప్పి రాజకీయం చేసి ఎన్నికల్లో వాడుకున్నారన్నారు. ఇది  ప్రచారానికి పరిమితమై నిరుద్యోగులను మోసగింపచేసారన్నారు. అయితే ముఖ్యమంత్రి వై.యస్‌. జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చి సియం బాధ్యతలు చేపట్టి ఈసుదీర్హ సమస్య పరిష్కారానికి సుముఖం చేసారన్నారు. ఆర్థికశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా. మినిమమ్‌ లైమ్‌ స్కేలులో యస్‌జిటిలుగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అవకాశం కలిగిందని ఇందుకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నుండి రాగానే సంతకం చేయనున్నారని అనంతరం జిఓను విడుదల చేయడం జరుగుతుందన్నారు. తదుపరి వీరికి ఆన్‌లైన్‌ లేదా ఇతర మాధ్యమాల ద్యారా వృత్తిపరమైన శిక్షణ అందించి నియామక ప్రక్రియను చేపడతామని ఆయన వెల్లడించారు. 

టెన్త, ఇంటర్‌ పరీక్షలపై మీడియా ప్రతినిధులు అడిగిన (ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ పరీక్షల ప్రక్రియకు సుమారు 40 రోజులు సమయం అవసరం ఉంటుందన్నారు. దీంతోపాటు విద్యార్థులు నిట్‌, జెజఇ, యం-సెట్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు కూడా సమయం అవసరం అవుతుందని, వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఇప్పటిలో పరీక్షలు నిర్వహించే వీలులేదన్నారు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో తీసుకుని వాటిపై సంతృప్తి చెందిన పిదప తల్లిదండ్రులకు ఆందోళన లేకుండా పరీక్షలు నిర్వహిం చేందుకు షెడ్యూలును ప్రకటిస్తామని మంత్రి వివరించారు.

2018 డియస్‌సి లో కూడా 6 వేల 361 పైచిలుకు అభ్యర్థులను నియమించడం జరిగిందన్నారు. మరికొన్ని పోష్టులుపై కోర్టు కేసులు ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించి మరో 486 పియుటి, స్కూల్‌ అసిస్టెంట్‌, తెలుగు పండిట్‌లకు పోష్టులకు సంబంధించిన నియామకాలను జరపబోతున్నామన్నారు. మరో 374 లాంగ్వేజ్‌ పండిట్‌ పోష్టులపై రిట్‌ పిటీషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని త్వరలో అడ్వకేట్‌ జనరల్‌ ద్వారా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ఏపి టెట్ పరీక్షల సిలబస్ :  ఏపి టెట్ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను తయారు చేసి టెట్ వెబ్సైట్లో  పొందుపరిచినట్లు మంత్రి సురేష్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సమాచారం బ్రోచర్‌ను ఈసందర్భంగా ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, ఆర్‌జెడి యస్‌. రవీంధ్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Download Syllabus: Click Here

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles