Trending

6/trending/recent

AP SSC, Inter Exams Update: అదే జరిగితే ఒక్కో స్టూడెంట్‌కు రూ.కోటి ఇవ్వాలి.. ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు (AP SSC, Intermediate Exams) తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ తరుణంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాష్ట్రప్రభుత్వం సమర్పించిన ఆఫిడవిట్ పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పరీక్షలు నిర్వహించడానికే మొగ్గుచూపుతున్నామన్న ప్రభుత్వ నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించి ఏ విద్యార్థికైనా కరోనా సోకి మరణిస్తే ఒక్కొక్కరి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. విద్యార్థుల ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిచింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ ను పరిశీలంచిన ధర్మసనం.. జూలై చివరిలో పరీక్షలు నిర్వహిస్తామన్నారుగానీ.. దానిపై పక్కాసమాచారం ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టమైన సమాచారం ఎక్కడా కనిపించలేదని వ్యాఖ్యానించింది. పరీక్షల నిర్వహణ అంశాన్ని 15 రోజులు ముందుగా చెబుతామన్నారని.. ఏర్పాట్లకు 15 రోజులు ఎలా సరిపోతుందని ప్రశ్నించింది.

పరీక్షల నిర్వహణ సిబ్బంది వివరాలు ఏవీ ఇవ్వలేనదని.. ప్రభుత్వమే అన్ని రకాల లాజిస్టిక్ వసతులు కల్పించాలంది. విద్యార్థులతో పాటు సిబ్బంది రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనన్న సుప్రీం ధర్మాసన... గాలి వెలుతురు ఉండే గదుల్లో పరీల నిర్వహణ వివరాలు లేవని చెప్పింది. రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ విద్యార్థుల సంఖ్య ఆధారంగా చూస్తే సుమారు 28 వేల గదులు అవసరమవుతాయని.. ఒక్కో గదిలో 15,20 మందిని కూర్చోబెట్టడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. ఆ లెక్కన చూస్తే 34వేలకు పైగా గదులు అవసరం అవుతాయని.. ఈ మొత్తంలో ఎలా అందుబాటులోకి తీసుకొస్తారని వ్యాఖ్యానించింది.


ఇక పరీక్షలు నిర్వహించాం.. పనైపోయిందని అనుకోలేమని.. ఆ తర్వాత వాటిని మూల్యాంకనం చేయాల్సి ఉంటుందని.. ఆ ప్రక్రియ ఎలా చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మూల్యాంకనం, తదనంతర ప్రక్రియకు సంబంధించిన వివరాలు అఫిడవిట్ లో లేవని వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కళ్లముందే చూస్తున్నామని.. పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణులు చెప్తున్నా ఎందుకిలా వ్యవహరిస్తున్నారని నిలదీసింది. ఇలాంటి అంశంలో నిర్ణయాత్మక ప్రణాళిక ఉండాలని.. మీ అఫిడవిట్ లో అంతా అనిశ్చితే ఉందని ఆక్షేపించింది.

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై బుధవారం అఫిడవిట్ సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎట్టిపరిస్థితుల్లో జూలై చివరివారంలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణకు ముందుకెళ్తున్నామని చెప్పింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నందున పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. రోజువారి పాజిటివ్ కేసుల తగ్గుదలతో పాటు రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసుల వివరాలను కూడా సుప్రీంకు సమర్పించింది. ఐతే విద్యార్థుల వైపు నుంచి ఆలోచిస్తే వారి ప్రాణాలకే ముప్పుకదా అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad