Trending

6/trending/recent

SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే డబ్బులు విత్ డ్రా.. డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి

 State Bank Of India: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా ? అయితే మీకు గుడ్ న్యూస్.. ఎస్బీఐ బ్యాంక్ తమ కస్టమర్లకు తీపికబురు అందించింది. ప్రస్తుతం దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా.. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తమ కస్టమర్ల కోసం సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. మీకు ఏదైనా పని ఉంటే.. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. అందుకోసం బ్యాంక్ వెబ్ సైట్ కు కూడా లాగిన్ కావల్సిన అసవరం లేదు. కేవలం మీ ఇంట్లో ఉండి ఫోన్ ద్వారా డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. మీకు డబ్బు అవసరం ఉండి కాల్ చేస్తే.. మీ బ్యాంకు ఈ చెంతకే వచ్చి మరీ డబ్బులు ఇస్తుంది. దీనికోసం కస్టమర్లు టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయడం గానీ.. మొబైల్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

సేవలు..

ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల ద్వారా కేవలం క్యాష్ విత్ డ్రా నే కాకుండా.. ఇంటి వద్ద నుంచి మరిన్ని సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. చెక్, డ్రాఫ్ట్, పే ఆర్డర్ సేవలు మాత్రమే కాకుండా KYC పత్రాలను సేకరించడం, లైఫ్ సర్టిఫికెట్స్ సేకరించడం, ఫారం 15Hను సమర్పించడం వంటి సౌకర్యాలను ఖాతాదారులు ఇంటి వద్ద నుంచే ఉపయోగించుకోవచ్చు.

ఎవరికి..

ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్‌కు సంబంధించి ఎస్బీఐ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కీలకమైన సమాచారాన్ని అధికారులు పొందుపరిచారు. ఈ సదుపాయాన్ని 70 ఏళ్లు పైబడిన వృద్ధులు వికలాంగులు ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా KYC కంప్లైంట్ ఖాతాదారులు కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ సౌకర్యం కోసం మీ మొబైల్ నంబర్‌ను ఖాతాకు జత చేయాల్సిన అవసరం ఉంది. జాయింట్ అకౌంట్, మైనర్ల ఖాతాలు, నాన్-పర్సనల్ ఖాతాలకు ఈ సౌకర్యం అందుబాటులో లేదు. అలాగే కస్టమర్, తన హోమ్ బ్రాంచ్ నుండి ఐదు కిలోమీటర్ల లోపల ఉండాలి. అటు ఇంటి చిరునామా, బ్యాంకులో రిజిస్టర్ చేయబడిన చిరునామాతో మ్యాచ్ అయి ఉండాలి.

ఎంత ఖర్చు అవుతుంది….

డోర్ స్టెప్ బ్యాంకింగ్ కస్టమర్ కేర్ ఆఫీసర్ తమ సంభాషణలో మాట్లాడుతూ.. ఆ వ్యక్తి రూ. 88.55 వసూలు చేస్తారు. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగులు మీ ఇంటికి అవసరైన అన్ని విధానాలను పూర్తి చేస్తారు. ఈ సేవ అన్ని వయసుల వినియోగదారులకు అందుబాటులో ఉంది.

ఎలా సద్వినియోగం చేసుకోవాలి..

ఎస్‌బీఐ టోల్ ఫ్రీ నంబర్- 1800 1037 188 లేదా 1800 1213 721కు కాల్ చేయడం ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. అలాగే https://bank.sbi/dsb వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ సేవను పొందండి. అటు ఫోన్‌లో డిఎస్‌బి మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఈ సదుపాయాన్ని పొందండి.

ట్వీట్..

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad