Trending

6/trending/recent

Pregnant Women Helpline: సర్కార్ కీలక నిర్ణయం.. గర్బిణి కోసం ప్రత్యేక వైద్య సహాయ కేంద్రం.. హెల్ప్ లైన్ నంబర్‌ ఏర్పాటు

 Pregnant Women Medical Assistance: కోవిడ్-19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా తెచ్చిన తంటా అంతా ఇంతా కాదు. ఇలాంటి సమయంలో గర్భిణీ స్త్రీలు, ప్రసవానికి దగ్గరలో ఉండే మహిళలు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు డాక్టర్ల సూచనల మేరకు పరీక్షలకు హాజరుకావాలని వైద్య నిపుణులు సూచిస్తు్న్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం వారి ఇబ్బందులను గుర్తించి ప్రత్యేక కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

కరోనా మహమ్మారి ఇది అన్ని రంగాలతో పాటు హెల్త్​ కేర్ సెక్టార్​ను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ సమయంలో దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు హాస్పిటళ్లు, నర్సింగ్​ హోమ్​లు కోవిడ్ బాధితులతో నిండిపోయాయి. దీంతో, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు, గర్భిణీ స్త్రీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా చాలామంది గర్భిణీ స్త్రీలు ఎటూ వెళ్లలేని స్థితిలో నరకయాతన అనుభవించారు. అటు, కొంతమంది డాక్టర్లు కూడా కరోనా భయంతో వైద్యం చేసేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుత్లో తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా సమయంలో గర్భిణీ స్త్రీలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం..గర్భిణీ స్త్రీలకు వైద్య సహాయం కోసం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేసింది. అంతేకాదు ప్రత్యేకించి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గర్భిణీ స్త్రీలు తమకు అవసరమైన వైద్య సహాయం కోసం 1800 599 12345 కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. ఎలాంటి ఇబ్బందులు అయిన తమ దృష్టికి వచ్చి పరిష్కారం పొందాలని పేర్కొంది.

గర్భిణీ స్త్రీలు సాధారణ జనాభా కంటే కోవిడ్-19 బారిన పడే అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు. గర్భధారణలో ఇప్పటివరకు కోవిడ్-19 నివేదించబడిన కేసులు మంచి రికవరీ రేట్లు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలకు గుండె జబ్బులు మరియు ఊబ‌కాయం స‌మ‌స్యలు ఎక్కువగా ఉంటాయి. కరోనా వైరస్ మహమ్మారి భయం వల్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల మహిళలకు ఒత్తిడికి గురికాకుండా ఉండడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad