Trending

6/trending/recent

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. మార్కెట్‌ నిపుణుల మాటలు నిజం కానున్నాయా..? తాజా ధరల వివరాలు

Gold Price Today: దేశంలో బంగారం ధరల్లో రోజురోజుకు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గుతుంటే మరో రోజు పెరుగుతుంది. అయితే దీపావళి వరకు రూ.60 వేల వరకు పెరగే అవకాశాలు ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అయితే మార్కెట్‌ నిపుణులు చెప్పినట్లే బంగారం ధరలు భారీగా పెరగనున్నాయని అనేది చూడాలి. ఇక తాజాగా శుక్రవారం బంగారం ధర ఎగబాకింది. దేశ వ్యాప్తంగా ఒక్కో నగరంలో ఒక్క విధంగా పెరిగింది. దాదాపు రూ.110 నుంచి రూ.150 వరకు పెరిగింది. దేశీయంగా చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర .45,290 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,740 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,290 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490 ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

కాగా, బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారు ధరలను తెలుసుకొని వెళ్లడం మంచిది.

అయితే వాస్తవానికి దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశాలు ఇప్పుడు లేవు. ఎందుకంటే ఏడాది నుంచి బంగారం కొనుగోళ్లు చాలా తగ్గిపోయాయి. విదేశాల నుంచి బంగారు దిగుమతులు కూడా తగ్గాయి. ప్రజల దగ్గర బంగారం, వెండి కొనేంత డబ్బు లేదు. కరోనా మహమ్మారి కారణంగా ఉన్న ఉద్యోగాలు పోయాయి. అందువల్ల ఎవరూ బంగారం కొనే పరిస్థితుల్లో లేరు. చాలా మంది డబ్బు కోసం బంగారం తాకట్టు పెట్టేస్తున్నారు. బంగారంపై పెట్టుబడులు కూడా బాగా తగ్గాయి. ఇలాంటప్పుడు బంగారానికి డిమాండ్ పడిపోయి ధరలు బాగా తగ్గాలి. కానీ గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad