Trending

6/trending/recent

Corona Variants: కరోనా వైరస్‌ రూపాంతరాలు… 3 నెలలకో కొత్త రకం! 14 నెలల్లో 4 వైరస్‌లు!!

 Corona New Variants: కంటికి కనిపించని శత్రువు..ప్రపంచ దేశాలపై ముప్పేట దాడి చేస్తోంది. అంతేకాదు, ఈ మహమ్మారి వైరస్‌ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ వస్తోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో మూడునెలలకు ఓ వెరియంట్‌ అధికంగా వ్యాప్తిలో ఉంటోంది. మొదటి దశ ఉధృతిలో ప్రధానంగా మూడు రకాల వైరస్‌లు వ్యాప్తిలో ఉండగా, రెండో దశలో ఒకటి కరుమరుగై, మరొకటి అధిక వ్యాప్తికి కారణమవుతోంది. ఇక ఒక్కో రకం వైరస్‌..మూడు నుంచి ఆరు నెలల వరకు ప్రభావం చూపిస్తున్నాయంటున్నారు సైంటిస్టులు.

ఇకపోతే, ఈ వైరస్‌ ఒకరి నుంచి మరోకరికి వ్యాపించే క్రమంలో రూపాంతరం చెందుతూ వస్తోంది. ఒక్కోదాంట్లో 15వరకు మ్యూటేషన్లు ఉన్న వైరస్‌ రకాలు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి. ఈ మార్పులను తెలుసుకునేందుకు సీసీఎంబీ తో పాటు సీడీఎఫ్‌డీ మరికొన్ని సంస్థలు వైరస్‌ జన్యు క్రమ ఆవిష్కరణలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 30కి పైగా సంస్థలు ఈ పరిశోధనలు చేస్తున్నాయి. రోజువారిగా వస్తున్న నమూనాలను 5శాతం నుంచి జన్యు క్రమ ఆవిష్కరణలు చేయాలని కేంద్రం మార్గదర్శకాలు ఉన్నా, ఆచరణలో మాత్రం అతి తక్కువ నమూనాలనే పరీక్షిస్తున్నారు. దీంతో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌ రకం ఏదో తెలుసుకుని, ఒక నిర్ధారణకు వచ్చేందుకు సైటిస్టులకు ఎక్కువ సమయం పడుతోంది.

అయితే, ఇప్పటి వరకు 14నెలల కాలంలో దక్షిణాదిలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రకాల కొవిడ్‌ వైరస్‌లను సైటిస్టులు గుర్తించారు. వీటిల్లో ఏ3ఐ, ఏ2ఏ,ఎన్‌440కె, బి.1.617 వైరస్‌లుగా గుర్తించారు. ఏపీ, తెలంగాణల్లో మొదట్లో ఏ3ఐ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఏ2ఎ కరోనా వేరియంట్‌ అధికంగా ఉందన్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగుతోందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad