Trending

6/trending/recent

AP Corona Cases: ఏపీలో 10వేలు దాటిన కరోణా మరణాలు.. కొత్త కేసులు ఎన్నంటే..!

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh)వు కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) విజృంభిస్తోంది. రోజురోజుకీ యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజూ దాదాపు 20వేల కేసులు నమోదవుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 90,609 శాంపిల్స్ ని పరీక్షించగా 19,981 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 1,787, చిత్తూరు జిల్లాలో 2,581, తూర్పుగోదావరి జిల్లాలో 3,227, గుంటూరు జిల్లాలో 1,040, కడప జిల్లాలో 893, కృష్ణాజిల్లాలో 1,064, కర్నూలు జిల్లాలో 1161, నెల్లూరు జిల్లాలో 912, ప్రకాశం జిల్లాలో 1,295, శ్రీకాకుళం జిల్లాలో 1,338, విశాఖపట్నం జిల్లాలో 2,308, విజయనగరం జిల్లాలో 838, పశ్చిమగోదావరి జిల్లాలో 1,537 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 15,62,060కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 13,41,355 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంటల్లో 18,336 మంది డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,10,683కి పెరిగింది.

రాష్ట్రంలో గత 24గంటల్లో 118 మంది మృతి చెందగా.., మొత్తం మరణాల సంఖ్య 10,022 కి చేరింది.

ఇప్పటివరకు రాష్ట్రంలో 1,85,25,758 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad