Trending

6/trending/recent

Gold Price Today 23-05-2021: తటస్థంగానే బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు ఇలా..

Today Gold Rates: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో కూడా పసిడి ధరలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో నిత్యం పెరుగుతూ వచ్చిన ధరలకు నిన్న, ఈ రోజు బ్రేక్ పడింది. కాగా చెన్నైలో మాత్రమే బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు తటస్థంగానే కొనసాగుతున్నాయి. అయితే.. బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్కెట్‌ ప్రకారం.. హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గితే.. మరోరోజు పెరుగుతుంటాయి. నెల క్రితం 40వేల చేరువలో ఉన్న బంగారం ధరలు.. ప్రస్తుతం 45 వేల మార్క్ దాటాయి. ఆదివారం బంగారం ధరలు తటస్థంగానే ఉన్నాయి. తాజాగా.. 22 క్యారెట్ల తులం బంగారం.. రూ.46,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 47,000 ఉంది. ప్రధాన నగరాల్లో అదేవిధంగా.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఓ సారి పరిశీలిద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 46,930 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 50,830 గా కొనసాగుతోంది.

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,000 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 47,000 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,750 వద్ద ఉంది.

చెన్నైలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,050 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,600 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.49,750 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,750 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,750 వద్ద కొనసాగుతోంది.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad