Trending

6/trending/recent

Anandayya Medicine: ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్

Anandayya Medicine:  ఆనందయ్య మందుపై సీఎంకు త‌ది నివేదికను ఆయుష్ కమిషనర్ రాములు సమర్పించారు. కంట్లో వేసే డ్రాప్స్‌ తప్ప ఆనందయ్య ఇస్తున్న మందులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కె అనే మందును కూడా కమిటీ ముందు చూపించనందున దీనికి నిరాకరించారు. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌ మందులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉంది. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని నివేదికలు పేర్కొన్నాయి. ఆనందయ్య మందు వాడితే కొవిడ్‌ తగ్గుతుందనడానికి నిర్ధారణలు లేవని నివేదికలు పేర్కొన్నాయి. కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉందని ఆయుష్ క‌మిష‌న‌ర్ సీఎంకు చెప్పారు. నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం పట్టే అవకాశం ఉంద‌ని వెల్ల‌డించారు. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టాను సారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని ప్ర‌భుత్వ తెలిపింది. ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్ పాజిటివ్‌ రోగులు రాకుండా ఉండాల‌ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రోగుల‌కు బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్తే.. కోవిడ్‌ విస్తరించే ప్రమాదం తప్పుతుంద‌ని సూచించింది.

పి, ఎల్, ఎఫ్‌ మందులు అంటే ఏమిటి ? ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకొండి.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad