Trending

6/trending/recent

Stop Stop: 44 మంది పిల్లలను కన్న 40 ఏళ్ల మహిళ.. ఇంక ఆపమ్మా అంటూ ప్రభుత్వం ఆదేశం

 Stop Stop:  ఒకరు లేదంటే ఇద్దరు పిల్లలు ఉంటే చాలనుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోషణ భారమవుతుందని అందరూ ఆలోచిస్తుంటే.. ఓ మహిళ ఏకంగా 44 మంది పిల్లలను కనిందనే వార్త అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె వయస్సు 40 కాగా.. ఆమెకు 44 మంది సంతానం కలుగగా.. అందులో 38 మందిని ప్రస్తుతం ఆమె గారాబంగా చూసుకుంటోంది. ఉగాండా దేశానికి చెందిన మరియమ్మ.. తన 11వ ఏట పెళ్లి చేసుకుంది.

పెళ్లైన ఏడాదికి అంటే అప్పటికి ఆమె వయస్సు 12 వచ్చేసరికి కవలలకు జన్మనిచ్చింది. ఆమె గర్భాశయం పెద్దగా ఉందని, కాబట్టి భవిష్యత్తులో ఎక్కువ మంది పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. గర్భాశయం తొలగించాలని ఆమె కోరగా.. అది సాధ్యం కాదని వారు చెప్పారు. ఇక అప్పటి నుండి మొత్తం 44మంది పిల్లలను కనగా.. అందులో కొందరు చనిపోయారు. ప్రస్తుతం 38 మంది పిల్లలను ఆమె చూసుకుంటోంది. మొత్తం ఐదుసార్లు కవవలకు, ఏడుసార్లు ఒకేసారి ముగ్గురు పిల్లలకు, ఐదుసార్లు ఒకేసారి నలుగురు పిల్లలకు ఆమె జన్మనిచ్చింది. ప్రస్తుతం భర్తకు దూరమైన ఆమె.. ఏదో రకంగా పిల్లలను పోషిస్తూ చదివిస్తోంది. మరియమ్మ పిల్లలను కనడాన్ని ఇక ఆపాలని ప్రభుత్వం ఆదేశించింది.



Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad