Trending

6/trending/recent

Summer Holidays: విద్యార్థులకు రెండు నెలలు వేసవి సెలవులు.. ఉత్తర్వులు జారీచేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూల్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. అలాగే చాలా రాష్ట్రాల్లో బోర్డ్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేశారు.

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూల్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రెండు నెలల పాటు వేసవి సెలవులను ప్రకటించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పార్మర్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యార్థులు ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అయితే అదే సయమంలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు వేసవి సెలవుల కాలంలో బోర్డ్ పరీక్షలు పూర్తయ్యేంతవరకూ వాళ్లు పోస్టింగ్‌లో ఉన్న హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని విద్యాశాఖ పేర్కొంది. ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్స్ సందర్భంగా టీచర్స్ విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉండొచ్చని తెలిపింది.

ఇక, మంగళవారం జారీచేసిన ఆ ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలలో ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి జూన్ 13వ తేదీ వరకూ సెలవులను ప్రకటించారు. ఏప్రిల్ చివరి వరకూ ఆన్‌లైన్ బోధన చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్టల్స్‌ను తక్షణమే మూసివేయాలని విద్యాశాఖ మంత్రి ఆదేశించారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాధికారులు, జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్లు, ప్రినిపాల్స్‌కు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో జరగాల్సిన పదో తరగతి, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్టు ఓ అధికారి బుధవారం తెలిపారు. ఇక, మంగళవారం మధ్యప్రదేశ్‌లో కొత్తగా 8,998 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక, రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 4,261కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 43,539 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad