Trending

6/trending/recent

ATM Transaction Failed: అకౌంట్‌లో డబ్బులు కట్ అయినా ఏటీఎంలో క్యాష్ రాలేదా? ఇలా చేయండి

ATM Transaction Failed | మీరు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా? మీ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయా? ఏం చేయాలో తెలుసుకోండి.

ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ కావడం మామూలే. అయితే ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావడానికి పలు కారణాలు ఉంటాయి. ఏటీఎంలో డబ్బులు లేకపోవడం వల్ల ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతుంది. లేదా పిన్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేసినా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ కావొచ్చు. ఇవి కాకుండా ఏటీఎంలో డబ్బులు ఉన్నా, పిన్ నెంబర్ సరిగ్గానే ఎంటర్ చేసినా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయిన ఘటనలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కస్టమర్ అకౌంట్‌లో డబ్బులు డెబిట్ అవుతాయి. కానీ ఏటీఎం నుంచి క్యాష్ రాదు. ఏటీఎం కార్డు ఉపయోగిస్తున్న ప్రతీ ఒక్కరూ ఈ సమస్య ఎదుర్కొనే ఉంటారు. మరి మీకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందా? మీ అకౌంట్‌లో డబ్బులు డెబిట్ అయినా ఏటీఎం నుంచి క్యాష్ రాలేదా? మరి ఏం చేయాలో తెలుసుకోండి.

 కస్టమర్ అకౌంట్‌లో డబ్బులు కట్ అయినా ఏటీఎంలో క్యాష్ రాని ఘటనలు మామూలే. ఇలాంటి సమయంలో ఏటీఎంలో వచ్చిన ట్రాన్సాక్షన్ స్లిప్ భద్రపర్చుకోండి. ఈ విధంగా ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు కొన్ని నిమిషాల్లోనే డబ్బులు మళ్లీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఒక రోజు సమయం పట్టొచ్చు. ఒక రోజు గడిచినా డబ్బులు తిరిగి అకౌంట్‌లోకి రాకపోతే మాత్రం మీరు అప్రమత్తం కావాలి. ఏటీఎం ట్రాన్సాక్షన్ స్లిప్‌లో ఉన్న రిఫరెన్స్ నెంబర్ నోట్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ మరోసారి చెక్ చేసుకోండి. మీ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయని, ఏటీఎంలో క్యాష్ రాలేదని మీ బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేసి కంప్లైంట్ చేయండి. మరో కంప్లైంట్ రాసి ఏటీఎం సెంటర్‌లో అందుబాటులో ఉన్న డ్రాప్ బాక్సులో వేయండి.

మీరు మీ బ్యాంకు అఫీషియల్ ఇమెయిల్ ఐడీకి కూడా మెయిల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. మీకు 24 గంటల్లో కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తుంది. మీ ట్రాన్సాక్షన్ వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత మీ బ్యాంకు ప్రాసెస్ మొదలుపెడుతుంది. వారం రోజుల్లో మీ అకౌంట్‌లోకి డబ్బులు తిరిగి వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా-RBI నిబంధనల ప్రకారం కస్టమర్లకు ఏడు వర్కింగ్ డేస్‌లో డబ్బులు క్రెడిట్ చేయాలి. ఆలస్యం చేస్తే బ్యాంకులు ప్రతీ రోజు రూ.100 చొప్పున మీకు పరిహారం చెల్లిస్తాయి. ఒకవేళ వారం రోజులైనా మీ అకౌంట్‌లోకి డబ్బులు రాకపోతే దగ్గర్లోని బ్రాంచ్‌కు వెళ్లి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ ట్రాకింగ్ నెంబర్ నోట్ చేసుకోవాలి. మీ సమస్య పరిష్కరించి డబ్బులు క్రెడిట్ చేసేందుకు బ్యాంకు సిబ్బంది సహకరిస్తారు.

మీరు బ్యాంకుకు వెళ్లినా మీకు డబ్బులు తిరిగి రాకపోతే బ్యాంకు వెబ్‌సైట్‌లో గ్రీవియెన్స్ సెల్‌కు కంప్లైంట్ చేయొచ్చు. ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ 30 రోజుల్లో పరిష్కారం అవుతాయి. బ్యాంకు గ్రీవియెన్స్ సెల్ కూడా మీ సమస్యను పరిష్కరించకపోతే 30 రోజుల తర్వాత నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్-NCDRC లో మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. మీ తరఫున సమస్ పరిష్కరించేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది. ఇన్ని చేసినా మీ డబ్బులు తిరిగి అకౌంట్‌లోకి రాకపోతే మీరు చట్టపరంగా ముందుకు వెళ్లొచ్చు. కానీ పరిస్థితి ఇంతవరకు రాదు. సాధారణంగా ఇలాంటి సమస్యలు మొదటి వారం రోజుల్లోనే పరిష్కారం అవుతాయి.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad