Trending

6/trending/recent

Covid-19 Vaccine Certificate: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా? సర్టిఫికెట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Covid-19 Vaccine Certificate | మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా? మొదటి డోసు పూర్తైందా? రెండో డోసు కోసం వేచిచూస్తున్నారా? మొదటి డోసు తీసుకున్నవారు కూడా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

1. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 45 ఏళ్ల వయస్సు పైబడ్డవారందరికీ వ్యాక్సిన్ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం భారతదేశంలో కోవ్యాక్సిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లను ఇస్తోంది ప్రభుత్వం. వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్లు జారీ చేస్తోంది.

2. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ 19 వ్యాక్సిన్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. మొదటి డోసు తీసుకున్న తర్వాత సదరు వ్యక్తి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి, ఫోన్ నెంబర్ వెరిఫై చేసి సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

3. మొదటి డోసు తీసుకున్న తర్వాత సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం తప్పనిసరి. రెండో డోసు కూడా పూర్తైన తర్వాత మరోసారి సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో పేరు, పుట్టిన తేదీ, రిఫరెన్స్ ఐడీ, వ్యాక్సిన్ పేరు, ఆస్పత్రి పేరు, వ్యాక్సిన్ తీసుకున్న తేదీ లాంటి వివరాలన్నీ ఉంటాయి.

4. ఆరోగ్య సేతు యాప్‌లో కూడా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఆరోగ్య సేతు యాప్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత CoWin ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.

5. అందులో Vaccination Certificate ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత బెనిఫీషియరీ రిఫరెన్స్ ఐడీ ఎంటర్ చేయాలి. చివరగా Get Certificate పైన క్లిక్ చేస్తే కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ అవుతుంది.

Aarogyasethu App Link: https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu&hl=en_IN&gl=US


 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad