Trending

6/trending/recent

Schools Closed: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేపటి నుంచి స్కూల్స్ అన్నీ బంద్

Telangana: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌ను రేపటి నుంచి మూసివేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో రేపటి నుంచి అన్ని విద్యా సంస్థలను మూసి వేస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు కాబట్టి స్కూల్స్ మూసి వేయాలని కోరుతున్నారని అందుకే రాష్ట్రంలో కరోనా వ్యాధి అరికట్టడం కోసం రేపటి నుంచి స్కూల్స్ మూసివేస్తున్నామని ప్రకటించారు. వీటికి అనుబంధంగా ఉన్న అన్ని హాస్టల్స్  కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో మాదిరిగానే ఆన్లైన్ క్లాస్ లు ఉంటాయని ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. విద్యార్థులు ,తల్లిదండ్రుల  క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసి వేస్తున్నామన్న ఆమె వైద్య కళాశాలలు మినహాయించి మిగతా అన్ని రకాల పాఠశాలలు ,కళాశాలలకు వర్తిస్తుందని అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసివేసిన సంధర్భంలో తెలంగాణలో కూడా విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేస్తున్నామని ఆమె అన్నారు. అయితే ఆన్ లైన్ లో తరగతులు కొనసాగుతాయని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లు, గురుకుల పాఠశాలల్లో కరోనా వైరస్ తిష్ట వేసినట్లుగా కనిపిస్తోంది. వరుసగా అన్ని మండలాలలోని ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ స్కూళ్లు, గురుకుల పాఠశాలల్లో, వసతి గృహాల్లో కరోనా పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి.  పెద్ద ఎత్తున కేసులు బయట పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad