Trending

6/trending/recent

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక… హోలీ సంద్భంగా ఇలాంటి మోసాలకు ఛాన్స్..

State Bank of India Alert: ఆన్‌లైన్ బ్యాంకింగ్ వాడకం పెరుగుతుండటంతోపాటు.. ఆన్‌లైన్ మోసాలు కూడా నిరంతరం పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో మనం ఇలాంటివాటిపై శ్రద్ధ వహించాలి. వాస్తవానికి సైబర్ నేరస్థులు ప్రజలను వివిధ మార్గాల్లో టార్గెట్ చేస్తారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలంటూ బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. తద్వారా ప్రజలు ఇలాంటి కేటుగాళ్లకు చిక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలు సూచిస్తున్నారు. హోలీ పండుగకు ముందు ఈ ఆన్‌లైన్ మోసాలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది.

మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా సమాచారాన్ని పంచుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఎస్‌బిఐ తెలిపింది. అలాగే, అధికారిక ట్విట్టర్‌లో ఎస్‌బిఐ వెల్లడించింన సమాచారం ప్రకారం… మీకు ఇలాంటి ఏదైనా మోసం జరిగితే వెంటనే సైబర్ పోలీసులకు లేదా సైబర్‌క్రైమ్.గోవ్.ఇన్‌కు ఫిర్యాదు చేయాలని కోరుతోంది.

ఎస్బిఐ తమ ట్విట్టర్ ఖాతాలో ఇలా పేర్కొంది. ‘ఎస్బిఐ మీ ఇ-కెవైసి వివరాలు / ఆధార్ నంబర్ / వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ అడగదు అని తెలిపింది. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం / డెబిట్ కార్డ్ సౌకర్యం / బ్యాంక్ ఖాతాను లింక్ చేసేందుకు ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ చేయవద్దని సూచించింది. అంతే కాకుండా మీ మొబైల్ నంబర్‌కు తమ సిబ్బంది ఎవరూ కాల్ చేయమని చెబుతుంది. ఇటువంటి కాల్స్, ఎస్ఎంఎస్, లింకుల గురించి జాగ్రత్తగా ఉండండలని పేర్కొంది. ఇలాంటివి ఆర్థిక మోసానికి దారితీస్తాయని వెల్లడించింది. ఇలాంటి కేసుల గురించి స్థానిక పోలీసు శాఖకు తెలియజేయండి.

ఇలాంటి నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఇలాంటివారి పట్ల జాగ్రత్తగాఉండాలని ఎస్బీఐ కస్టమర్లకు సూచించింది. జనవరి 5 నాటికి ఎస్బిఐకి దేశవ్యాప్తంగా 44.89 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు.

సైబర్  మోసాలను నివారించడానికి ఈ విషయాలను కూడా గుర్తుంచుకోవాలి…

1. మీ వ్యక్తిగత సమాచారాన్ని వేరే వ్యక్తితో పంచుకోవద్దు. ముఖ్యంగా తెలియని వ్యక్తితో దీన్ని షేర్ చేయవద్దు.
2. మీ బ్యాంక్ ఖాతా యొక్క పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మార్చండి.
3. తెలియని వ్యక్తికి ఎప్పుడైనా ఫోన్, ఇమెయిల్ లేదా SMS ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను పంచుకోండి.
4. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు.
5. బ్యాంక్ సమాచారాన్ని సేకరించడానికి, ఎల్లప్పుడూ బ్యాంకు యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా సమాచారాన్ని సేకరించండి.
6. మీతో మోసం గురించి ఏదైనా సమాచారం సేకరించడానికి, సమీప ఎస్బిఐ శాఖ మరియు పోలీసు అధికారులకు వీలైనంత త్వరగా తెలియజేయండి.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad