Trending

6/trending/recent

Google: మీ డేటా గూగుల్‌లో సురక్షితంగా ఉండాలంటే.. జస్ట్ ఈ ట్రిక్స్ తెలిస్తే చాలు.!

Google Security: ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లలో గూగుల్ వాడకం సర్వ సాధారణం. గూగుల్, గూగుల్‌కు సంబంధించిన యాప్స్‌ను సెర్చింగ్‌కు ఉపయోగిస్తే చాలు.! నేరుగా గూగుల్‌కు కనెక్ట్ అయిపోతాం. ఈ నేపధ్యంలో మన డేటా గూగుల్‌లో సురక్షితంగా ఉంచడం చాలా అవసరం. వాస్తవానికి, మనం చాలాసార్లు Gmail ఖాతాను వివిధ ప్రదేశాల నుంచి లాగిన్ అవుతుంటాం. లేదా కొన్ని సందర్భాల్లో యాప్స్ ద్వారా.. డిఫరెంట్ డెస్క్‌టాప్స్ నుంచి జీమెయిల్ ఖాతాను ఓపెన్ చేస్తాం. ఇలా చేయడం వల్ల మన డేటా కాస్తా దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే గూగుల్ మన డేటాను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో చెబుతూ తాజాగా ఓ ట్వీట్ చేసింది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీ డేటా ఎంత సురక్షితంగా ఉందో తెలుస్తుంది. జస్ట్ అక్కడ పేర్కొన్న 6 ఆప్షన్స్ ఎంచుకుంటే మీ డేటా ఎంత సెక్యూర్‌గా ఉందో తెలుసుకోవచ్చు.

ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా, మొదటిగా మీ Gmail ఖాతా ఏయే మొబైల్స్ లేదా డెస్క్‌టాప్స్‌లో ఓపెన్ అయి ఉందో తెలుస్తుంది. వాటిల్లో మీరు ఉపయోగించనటువంటి వాటిని “Remove” చేయండి. దాని ద్వారా ఏ డివైస్‌లో మీ అకౌంట్ ఓపెన్ ఉంటుందో.. అది క్లోజ్ అవుతుంది.

  • దీని తరువాత, మీరు ఇటీవల చేసిన సెక్యూరిటీ యాక్టివిటీ గురించి తెలుసుకోవచ్చు. గత 28 రోజుల్లో మీ ఖాతా చేసిన టాస్క్‌లపై నిఘా ఉంచవచ్చు. అందులో మీరు చేయని టాస్క్ ఏదైనా ఉంటే, అక్కడ చూపించే ట్రిక్స్‌ను అనుసరించండి.
  • గూగుల్ మీకు సైన్-ఇన్, రికవరీ ఎంపికను కూడా ఇస్తుంది. అవసరమైతే, మీరు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్, రికవరీ ఈ-మెయిల్, సెక్యూరిటీ క్వశ్చన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
  • థర్డ్ పార్టీ యాక్సెస్, ఈ ఆప్షన్ ద్వారా, మీ Google ఖాతా నుండి ఏ వెబ్‌సైట్‌లు, యాప్స్ డేటా యాక్సెస్ కోసం అడుగుతున్నాయో చూడవచ్చు. అవసరం లేకపోతే, చిన్న క్లిక్ ద్వారా వాటిని తొలగించవచ్చు.
  • Setting Up Gmail, ఇక్కడ మీరు బ్లాక్ చేసిన జీ-మెయిల్ అకౌంట్లను చూడవచ్చు. అవసరమైతే వాటిల్లో కొన్నింటిని అన్‌-బ్లాక్ చేసుకోవచ్చు.
  • Your Saved Password, ఇక్కడ మీరు Gmail ద్వారా ఎన్ని వెబ్‌సైట్‌లలో లాగిన్ అయ్యారో తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియను కొనసాగించడం ద్వారా మీరు ఈ వెబ్‌సైట్ల పాస్‌వర్డ్‌ను కూడా మార్చవచ్చు.


 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad