Trending

6/trending/recent

Gas Cylinder Booking: కేవలం రూ.170 కే గ్యాస్ సిలిండర్ పొందొచ్చు తెలుసా? ఇలా బుక్ చేయండి

ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 870 గా ఉంది. అయితే గ్యాస్ సిలిండర్ ను ఇలా బుక్ చేస్తే రూ. 170 కే పొందొచ్చు.

ఇటీవల దేశీయ వంట గ్యాస్ సిలిండర్ల ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసింది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.870కి చేరడంతో గ్యాస్ అంటేనే గడగడలాడే పరిస్థితి ఏర్పడింది.

ఈ తరుణంలో ప్రముఖ పేమెంట్ యాప్ Paytm వినియోగదారులకు సూపర్ ఆఫర్ అందిస్తోంది. ఏకంగా గ్యాస్ బుకింగ్ పై రూ.700 వరకు క్యాష్ బ్యాక్ అందుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు కూడా ఈ క్యాస్ బ్యాక్ అందుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

1. ముందుగా Paytm యాప్ ఓపెన్ చేయండి.

2. అనంతరం “రీఛార్జ్ అండ్ పే బిల్” ఆప్షన్ పై క్లిక్ చేయండి.

3. తర్వాత 'బుక్ గ్యాస్ సిలిండర్' ఆప్షన్ ను ఎంచుకోండి.

4. అనంతరం మీరు వాడే సిలిండర్ కంపెనీని ఎంచుకోండి.

5. రిజిస్టర్ మొబైల్ నంబర్ లేదా మీ ఎల్‌పిజి ఐడిని నమోదు చేయండి. అనంతరం బిల్ పే చేసి సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు.

6. ఇలా బుక్ చేసుకున్న 24 గంటల్లో మీకు రూ. 700 వరకు విలువ కలిగిన క్యాష్ బ్యాక్ స్క్రాచ్ కార్డు వస్తుంది. ఈ కార్డును 7 రోజుల్లోగా ఉపయోగించాల్సి ఉంటుంది.

7. అయితే మొదటి సారి పేటిఎం ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకే ఈ ఆఫర్ అందుతుంది.

అయితే ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మరో ఏడు రోజులు మాత్రమే..

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad