Trending

6/trending/recent

Corona Vaccine FAQ: 45 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్.. ముఖ్యమైన 8 ప్రశ్నలకు సమాధానాలు.. కచ్చితంగా తెలుసుకోండి

Covid-19 Vaccine: తాజాగా ప్రభుత్వం అందించిన సూచనల ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సీన్ తీసుకోవచ్చు.

కరోనా వ్యాక్సీన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వాటిని అందించిన ప్రభుత్వం ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారికి అందిస్తోంది. తాజాగా ప్రభుత్వం అందించిన సూచనల ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సీన్ తీసుకోవచ్చు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు. ఇప్పటివరకూ తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 45 పైబడిన వారికే కోవిడ్ 19 వ్యాక్సీన్ ని అందించారు. 45 ఏళ్లు పైబడిన వారు ఇప్పుడు ఎవరైనా సరే ఈ వ్యాక్సీన్ తీసుకోవచ్చు.

కోవిన్ 2.0 లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే..

ముందుగా కోవిన్ https://www.cowin.gov.in/ ఓపెన్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి Verify పైన క్లిక్ చేయండి.

 ఆ తర్వాత వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ ఎంటర్ చేయండి. పేరు, వయస్సు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఏదైనా ఐడీ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయండి.

 ఆ తర్వాత రిజిస్ట్రేషన్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అకౌంట్ డిటైల్స్ మీద క్లిక్ చేస్తే వివరాలు కనిపిస్తాయి.

 ఒకే మొబైల్ నెంబర్‌తో మరో ముగ్గురి పేర్లు కూడా యాడ్ చేయొచ్చు. దీనికోసం యాడ్ మోర్ అని బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.

 రిజస్ట్రేషన్ తర్వాత అపాయింట్‌మెంట్ పైన క్లిక్ చేయండి. దీనికోసం వాక్సినేషన్ సెంటర్ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, పిన్ కోడ్ లాంటివి సెలెక్ట్ చేయాలి. అందుబాటులో ఉన్న తేదీల వివరాలు కనిపిస్తాయి

 తేదీ సరిచూసుకున్న తర్వాత book పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత వ్యాక్సినేషన్ అపాయింట్‌మెంట్‌తో మెసేజ్ వస్తుంది.

కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు

1.రిజిస్ట్రేషన్ ఎప్పుడు మొదలవుతుంది?
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 45 సంవత్సరాల పైబడిన వారికి వ్యాక్సీన్ అందించేందుకు చర్యలు చేపట్టాలని లేఖ రాసింది. వీరి రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1వ తేదీన మొదలవుతుంది.

 2. సర్టిఫికెట్ అవసరమవుతుందా?
ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ల పైబడిన వారు వ్యాక్సీన్ వేయించుకునేందుకు ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదు. కోవిన్ యాప్, పోర్టల్ లో కూడా ఈ మేరకు మార్పులు చేయడం జరిగింది. 1977, జనవరి 1 కంటే ముందు పుట్టిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సీన్ అందుబాటులో ఉంటుంది. అంటూ యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ వెల్లడించారు.

 3. ఐడీ ప్రూఫ్ గా ఏం చూపించాల్సి ఉంటుంది?
ఆధార్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, హెల్త్ ఇన్య్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, పెన్షన్ డాక్యుమెంట్, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్ బుక్, MGNREGA జాబ్ కార్డ్, ఎంపీ, ఎంఎల్ ఏ, ఎంఎల్ సీ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ ఐడీ కార్డ్ వంటి కార్డులన్నీ వాక్సినేషన్ కోసం ఉపయోగించవచ్చు.

 4. కుటుంబ సభ్యులకు అపాయింట్ మెంట్ బుక్ చేయడం ఎలా?
ఒకసారి ఒక లైవ్ అపాయింట్ మెంట్ మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్లికేషన్ పై అపాయింట్ మెంట్ తీసుకోవచ్చు. ఏప్రిల్ 2 తర్వాత అపాయింట్ మెంట్స్ ఎప్పుడైనా బుక్ చేసే వీలుంటుంది.

 5. రెండో డోస్ కోసం అపాయింట్ మెంట్ తీసుకోవడం ఎలా?
మొదటి డోస్ తీసుకున్న 29 రోజుల తర్వాత రెండో డోస్ ని అదే సెంటర్ లో తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కోవిన్ యాప్, లేదా ప్లాట్ ఫాం ద్వారా రిజిస్టర్ చేసుకునే వీలుంటుంది.

6. స్మార్ట్ ఫోన్ లేకపోతే ఎలా?
స్మార్ట్ ఫోన్ లేకుండా ఆన్ లైన్ లో అప్లై చేసుకోలేని వారికోసం ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంది. మీరు స్థానిక ఆసుపత్రులకు వెళ్లి అక్కడే వ్యాక్సీన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.

 7. ఎన్ని ఆసుపత్రుల్లో వ్యాక్సీన్ సౌకర్యం ఉంది?
ఈ వ్యాక్సీన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కొన్ని పెద్ద ప్రైవేట్ ఆసుపత్రుల్లో తీసుకునే వీలుంది. PMJAY ఆయుష్మాన్ భారత్ కింద నమోదైన పదివేల ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే అక్కడ వ్యాక్సీన్ కోసం రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు.

8. ఎంత మందికి వ్యాక్సినేషన్ అందింది?
మార్చి 23 వరకు చూస్తే 5.21 కోట్ల డోసులు దేశంలోని ప్రజలకు అందించారు. జనవరి 16న దీన్ని ప్రారంభించి హెల్త్ వర్కర్స్ అందరికీ అందించారు. మార్చి 1న రెండో ఫేజ్ లో భాగంగా అరవై సంవత్సరాల పైబడిన వారు 45 సంవత్సరాల పైబడిన దీర్ఘ కాలిక సమస్యలున్నవారికి దీన్ని అందిస్తున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే మూడో దశలో 45 ఏళ్ల పైనున్న ప్రతి ఒక్కరికీ దీన్ని అందించనున్నారు. 


 

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad