Trending

6/trending/recent

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షకు వేళాయే

  • 6 వేలకు పైగా దరఖాస్తులు రాక
  • 45 కేంద్రాల్లో పరీక్షకు ఏర్పాట్లు

న్యూస్ టోన్, గుంటూరు: కరోనా వైరస్‌ నేపథ్యంలో 2019-20 విద్యా సంవత్సరంలో ‘పది’ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ట్రిపుల్‌ ఐటీలో సీట్ల కేటాయింపునకు ఈసారి ప్రవేశ పరీక్ష పెడుతున్నారు. ఆ పరీక్ష రాయడానికి జిల్లాకు చెరదిన 6864 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ప్రతిభ ఆధారంగా ఎంపికలు ఉండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకు ముందు పదిలో పదికి పది గ్రేడు పాయింట్లు వచ్చినవారికి, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు దక్కేవి. ప్రస్తుత ప్రవేశపరీక్షకు ఆర్జీయూకేటీ సెట్‌-2020 నిర్వాహకుల ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ఈనెల 28న జరిగే ఈ పరీక్షకు పరిశీలకులను నియమించారు. పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఎవరికైనా హాల్‌టిక్కెట్లు అందకపోయినా, దానిపై ధ్రువీకరణ అధికారి సంతకం లేకపోయినా విద్యార్థులు ఏ పాఠశాలలో అయితే చదివారో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలపై అటెస్ట్‌ చేయించుకుని రావాల్సి ఉంటుంది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad