Trending

6/trending/recent

ట్రిపుల్ ఐటి ప్రవేశ పరీక్షకు సర్వం సిద్ధం

న్యూస్ టోన్, విద్య : ట్రిపుల్ ఐటి లలో ప్రవేశానికి పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడమైనది అని కన్వీనర్ శ్రీ హరి నారాయణ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పరీక్ష 28-11-2020 వ తేదీ శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. ఈ పరీక్షకు మొత్తం 88,972 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో 48,422 మంది బాలురు మరియు 40,550 మంది బాలికలు హాజరవుతున్నారు. ఇందులో 86,617 మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌ నుండి మరియు 2,355 మంది విద్యార్ధులు తెలంగాణ నుంచి హాజరవుతున్నారు. మొత్తం 638 పరీక్ష కేంద్రాలకు గానూ 630 పరీక్ష కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌ లోనూ మరియు 8 పరీక్ష కేంద్రాలు తెలంగాణాలోనూ ఏర్పాటు చేయడమైనది. ఈ పరీక్ష ద్వారా నాలుగు IIIT లలో ఉన్న 4000 సీట్లను మరియు ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం మరియు డా.వై.ఎస్‌.ఆర్‌. హార్టీకల్చ్బరల్‌ విశ్వవిద్యాలయాలలో గల 6,000 సీట్లను డిప్లొమా కోర్సుల కొరకు ప్రవేశం కల్పిస్తారు. ఈ పరీక్షలకు 53 మంది అంధ విద్యార్థులు కూడా హాజరవుతున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, OMR షీట్లు మరియు పరీక్ష కేంద్రానికి సంబంధించిన మెటీరియల్‌ అంతా కూడా జిల్లాలకు రవాణా చేయడమైనది. అలాగే జిల్లా కేంద్రాల నుండి పరీక్ష కేంద్రాలకు సమీపంలోనున్న పోలీస్‌ స్టేషన్లలో వీటిని భద్రపరచడం అయినది. ఈ పరీక్షలకు సంబంధించిన చీఫ్‌ సూపరింటెండెంట్‌ లు, డిపార్మ్మెంటల్‌ ఆఫీసర్‌ లు, రూట్ ‌ఆఫీసర్‌ లు, ఇన్విజిలేటర్‌ లు మరియు మిగిలిన బోధనేతర సిబ్బంది నియామకాలు పూర్తి అయినవి అని కన్వీనర్ శ్రీ హరి నారాయణ తెలిపారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad