Trending

6/trending/recent

ఈ రోజు FAPTO CSE, AP వారితో చర్చించబోయే అంశాలు

ఫ్యాప్టో రేషనలైజేషన్ పై కింది అంశాలను ప్రతిపాదించింది..

1 ) ప్రాథమిక పాఠశాలలకు 1:20 అమలు చేయాలి . 41 రోలు వద్ద 3 , 61 రోలు వద్ద 4 , 80 పై బడిన మోడల్ పాఠశాలలను 2 + 1 LFL , తో కొనసాగించాలి .

 2 ) ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టు మంజూరు చేయాలి . 

3 ) ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రత్యేక ఆంగ్ల ఉపాధ్యాయుల పోస్టు మంజూరు చేయాలి . 

4 ) అవసరమైన నూతన పోస్టుల మంజూరు కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి . 

5 ) ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే సందర్భంలోనూ 1:20 అమలు చేయాలి .. ! 

6 ) ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉన్నత తరగతుకు 1:35 గా ఉండాలి .

7 ) ఉన్నత పాఠశాలలకు రోలు వారి కాకుండా మీడియం వారీగా పోస్టులు మంజూరు చేయాలి .

8 ) ఉన్నత పాఠశాలలకు సెకప్ 1:35 గా ఉండాలి . 

9 ) ఆప్ గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుని పోస్టుతో పాటు ఇతర అవసరమైన పోస్టులను మంజూరు చేయాలి .

10 ) కటాఫ్ తేదీ అక్టోబర్ 1 గా ఉండాలి .

బదిలీలు అంశాలలో సవరించ వలసినవి :

 1 . 2019 జూస్ నుండి భర్తీ చేసిన పదోన్నతులు , అప్ గ్రేడేషన్ పాఠశాలలను ఖాళీలు గా చూపాలి . పదోన్నతులు పొంది 2 సర్వీసు ఉన్న వారిని మినహాయించాలి . 2018 DSC నియామకాల పోస్టులను ఖాళీలుగా చూపాలి . 

2 ) పోస్టలను బ్లాక్ చేయకుండా అన్ని ఖాలీలను బదిలీలకు చూపాలి . 

3 ) ప్రభుత్వ , జిల్లా పరిషత్ పాఠశాలల మధ్య బదిలీలకు అవకాశం ఇవ్వాలి .

 4 ) ఏజన్సీ నుండి ప్లేస్ ఏరియాకు అవకాశం కల్పించాలి . 

5 ) ఆగస్టు 31 కటాఫ్ గా ఉపాధ్యాయులకు 8 , ప్రధానోపాధ్యాయులకు 5 పూర్తి సంవత్సరాలుగా ఉండాలి . 

6 ) సర్వీసు పాయింట్లు ఏడాదికి 1 చొప్పున ఉండాలి . 

7 ) కేటగిరి , సర్వీసుకు గరిష్ట పాయింట్ల పరిమితిని తీసివేయాలి . 

8 ) పదవీ విరమణ కు 3 సంవత్సరాల లోపు ఉన్న వారిని తప్పని సరి బదిలీ నుండి మినహాయించాలి . 

9 ) స్పాట్ విషయంలో రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్నా అనుమతించాలి . 

కౌన్సెలింగ్ గురించి....

1 ) ప్రధానోపాధ్యాయులకు వెబ్ కౌన్సెలింగ్ పెట్టవచ్చు . 

2 ) స్కూల్ అసిస్టెంట్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ పెట్టాలి . 

3 ) తప్పని సరిగా SGT లకు మాన్యువల్ కౌన్సెలింగ్ పెట్టాలి . సుమారు 2000 ఖాళీలను ఎంపిక చేసుకోడం వల్ల తీవ్రనష్టం జరుగుతుంది .

 4 ) ప్రస్తుతం అన్ లాక్ 5.0 లో అన్నింటిపై నియంత్రణ ఎత్తివేస్తున్నందున మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి . 

5 ) జూలై 1 వ తేదీన జరిపిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో అంగీకరించిన అంశాలనూ పొందు పర్చలేదు . పై అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad